బాలయ్య-బోయపాటి  కాంబినెషన్ లో ఓ మూవీ తెరపైకి రానుంది. దీనికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 28న బాలయ్య-బోయపాటి కాంబోలో కొత్త సినిమా స్టార్ట్ అవుతుందని అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో  బాలయ్య షెడ్యూల్ బీజీగా ఉండటంతో డేట్ ఫిక్స్ చేసుకొని రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఎన్నికల తర్వాత పెట్టుకుంటారట. బాలయ్య పూర్తిగా ఎలక్షన్లపై దృష్టిపెట్టి ఆ తర్వాత బోయపాటి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్.


గతంలో బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరపైకి  వచ్చే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇటు బాలయ్య  అభిమానులు కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు