బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ఈ చిత్రం తర్వాత ఆయనకు పలు బాలీవుడ్ సినిమాలలో ఆఫర్స్ వచ్చినా తను సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ప్రభాస్ "'సాహో" చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల అవుతోంది. అయితే పలువురు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఎలాగైనా ప్రభాస్‌తో ఒక సినిమా కచ్చితంగా తీయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యకాలంలో రిలీజైన 'ప‌ద్మావ‌త్‌' చిత్రంలో కూడా ప్రభాస్‌ను నటించమని నిర్మాతలు కోరారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన తిరస్కరించారు. అలాగే బాహుబలి చిత్రాన్ని హిందీలో ప్రమోట్ చేసిన కరణ్ జోహార్ కూడా ఓ సినిమాలో ప్రభాస్‌ను సెకండ్ లీడ్‌గా నటించమని అడిగారట. 'త‌ఖ్త్‌‌' పేరుతో తీయాలనుకున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌తో పాటు రణ్ వీర్ సింగ్, కరీనా కపూర్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్లు అందరినీ తీసుకోవాలని భావించారట. అయితే ఈ చిత్రంలో నటించడానికి కూడా ప్రభాస్ ఆసక్తి చూపించలేదట. 


ఒక వేళ ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే మల్టీ స్టారర్ చిత్రం ద్వారా కాకుండా సోలో హీరోగానే ఆయన నటించే అవకాశముందని కూడా పలువురు అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సాహో చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌తో పాటు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్ కూడా నటిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబయి, అబుదాబి, దుబాయ్, రొమానియా, యూరోప్ ప్రాంతాల్లో ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.