Weight Loss Secrets: ఈ 10 టిప్స్ ఫాలో అయితే చాలు మీ బరువు తేలిగ్గా తగ్గిపోతుంది
చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కాని చివరికి విఫలమవుతారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఒత్తిడితో ఉండేవి కాకుండా సులువైన పద్దతిలో ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాంటి కొన్ని సులువైన మార్గాలు
Weight Loss Secrets: చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, కాని చివరికి విఫలమవుతారు. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఒత్తిడితో ఉండేవి కాకుండా సులువైన పద్దతిలో ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాంటి కొన్ని సులువైన మార్గాలు:
క్యాలరీల కౌంట్ తగ్గించండి
సోడా, కాఫీ, టీ, ఫ్రూట్ జ్యూస్ మరియు ఆల్కహాల్ లను తాగటం తగ్గించాలి. వీటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయని గుర్తించుకోండి. వీటికి బదులుగా మంచి నీటిని తాగితే ఫలితం ఉంటుంది. ప్రతీరోజూ నీటిని ఎక్కువగా త్రాగడం వలన తక్కువ క్యాలరీలతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ చేసేటపుడు పాలకి బదులుగా నీటితో చేసుకొని త్రాగడం వలన మీరు తీసుకొనే క్యాలరీలను తగ్గించినట్లే.
పనెక్కువ చేయండి
క్యాలరీలు ఖర్చు చేయడం చాలా సులువైన పని. మీరు ఏదైనా ఫోన్ లో సంభాషిస్తున్నపుడు కూడా అటూ ఇటూ నడవడం ద్వారా మీ క్యాలరీలని తగ్గించవచ్చు. బరువు తగ్గడానికి క్యాలరీలు ఖర్చు చేయడం చాలా సులువైన పద్ధతి.
Also Read: RBI Good News:ఆర్‌బీఐ కీలక ప్రకటన.. త్వరలో ప్రారంభంకానున్న ఆఫ్‌లైన్ డిజిటల్ సేవలు
కూర్చోని చేసే వ్యాయామం
మీరు ఏదైనా పని చేస్తూ కూర్చున్నపుడు కూడా తగిన వ్యాయామంతో క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కూర్చునేటపుడు నిటారుగా కూర్చోండి. శ్వాస బలంగా తీసుకోండి. ఆ తరువాత మీ తొడ బాగం బిగుతుగా ఉండేలా కాళ్లని ఉంచండి. ఇలా చేయడం వలన మీ యొక్క క్యాలరీలు ఉపయోగించబడి, బరువు తగ్గుటకు ప్రధాన కారణం అవుతుంది.
లేబుల్స్ చదవండి
మీరు కొనే ఏ వస్తువు అయిన, వాటి మీద ఉండే లేబుల్స్ చదవడం వలన వాటి యొక్క క్యాలరీల గురించి తెలుస్తుంది. దాని ద్వారా మీరు ఆహరం ఎంత తినాలో మీకే అర్థమవుతుంది. మీకు కావలసిన మేరకు మాత్రమే ఆహరం తినడం వలన మీరు త్వరగా బరువు తగ్గవచ్చు.
మధ్యాహ్నం సలాడ్స్ తీసుకోండి
సలాడ్స్ చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. బరువు తగ్గాలనుకునేవారు మద్యాహ్నం భోజనం చేయడం కంటే సలాడ్స్ తీసుకోవడం చాలా ఉత్తమమైన పని. సలాడ్ లో ఎక్కువగా ఆకు కూరగాయలు ఉండేలా చూసుకోండి.
Also Read: Kondapolam trailer: ఉప్పెన హీరో కొండపొలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెట్లు వాడండి
మీరు పని చేసే ఆఫీస్ లో కాని, మీ అపార్ట్ మెంట్ లో కాని ఉండే ఎలివేటర్, లిఫ్ట్ కి బదులుగా మెట్లు ఎక్కండి. ఎక్కువసార్లు అలా పైకి, కిందకి మెట్ల పై వెళ్ళడం ద్వారా మీ యొక్క క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఫలితంగా, మీరు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
దూరంగా ఉండే విశ్రాంతి గది
మీరు, మీ ఆఫీస్ నుంచి దూరంగా ఉండే విశ్రాంతి గదిని ఎంచుకోండి. అలా పని తరువాత దూరంగా ఉండే విశ్రాంతి గదికి వెళ్ళడం వలన మీ యొక్క క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సహోద్యుగులతో ఏదైనా విహార యాత్రకి వెళ్ళడం వంటివి చేయడం ద్వారా మీ యొక్క బరువుని తగ్గించుకోవచ్చు.
అల్పాహారం
పప్పులు లేక ధాన్యాలు వంటివి మీ పొట్ట పెరగకుండా చూస్తాయి. మీరు ఏదైనా పనిలో ఉన్నపుడు కొన్ని పప్పులు మీ వెంట ఉండేలా చూసుకోండి. అవి మీ ఆకలిని తీర్చుతాయి. మీ చేతి నిండా పప్పులు తింటే మీకు శక్తి రావడమే కాకుండా రక్తంలోని చెక్కర స్థాయిని కూడా సరి సమానంగా ఉంచుతుంది.
Also Read: Samantha Emotional Post: "నాపై వ్యక్తిగత దాడి సమంజసం కాదు": సమంత ఎమోషనల్ పోస్ట్
కార్బోహైడ్రేట్లతో జాగ్రత్త
కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలిసిన శక్తిని సమకూరుస్తాయి. కావున తగినంత కార్బోహైడ్రేట్లు తినడమే ఉత్తమం. పాస్తా, పిజ్జా, బ్రెడ్ మరియు అన్నం వంటివి ఎక్కువగా కాకుండా కావలిసినంత తినండి.
సాస్ వంటి వాటిని నివారించండి
కెచప్, మాయో మరియు ఇతర సాస్ వంటి పదార్థాల వాడకం తగ్గించండి.వాటి వలన ఒక రోజుకి దాదాపుగా 100 క్యాలరీల శక్తి వరకు విడుదల అవుతుంది. కావున మీ బరువు పెరిగే ప్రమాదం ఉంది.
బరువు తగ్గడానికి ఏవో పెద్ద ప్రయత్నాలు చేసి విఫలం అవడం కంటే పైన చెప్పిన చిన్న ప్రయత్నాలు చేసి చూడండి. అవి మీ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook