Type 2 Diabetes Diet: షుగర్ పేషంట్లకు 7 బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్స్.. రక్తంలో చక్కెరస్థాయిలను పెరగనివ్వవు..
Type 2 Diabetes Diet: టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారికి షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. వీరి శరీరంలో ఇన్సూలిన్ సరైన స్థాయిలో ఉత్పత్తికాకపోవడం లేదా కణాలు ఇన్సూలిన్‌ను వినియోగించకపోవడం జరుగుతుంది.
Type 2 Diabetes Diet: టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారికి షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. వీరి శరీరంలో ఇన్సూలిన్ సరైన స్థాయిలో ఉత్పత్తికాకపోవడం లేదా కణాలు ఇన్సూలిన్‌ను వినియోగించకపోవడం జరుగుతుంది. దీంతో షుగర్ కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ ప్రాణాంతక స్థితికి చేరకుంటుంది. ఇది గుండె, కిడ్నీ, నరాల నష్టానికి దారితీస్తుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు లైఫ్‌స్టైల్‌లో మార్పులు తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్, మంచి మందులు తీసుకోవాలి. ఇందులో బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. ఈరోజు మనం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన 7 బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ తెలుసుకుందాం.
ఉప్మా..
ఉప్మా తరతరాలుగా మన ఇండియన్ సంప్రదాయంలో భాగం. దీన్ని సూజీతో తయారు చేసుకుంటారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. ఉప్మాలో క్యారట్, గ్రీన్ పీస్, బీన్స్ కూడా వేసి తయారు చేసుకుంటారు. ఇందులో ఎన్నో పోషకాలు, ఫైబర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగనివ్వవు.
పోహా..
పోహాను కూడా రైస్‌తో తయారు చేస్తారు. ఇది మరో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఇది లైట్ బ్రేక్‌ఫాస్ట్. పోహా సులభంగా జీర్ణం అవుతుంది. దీన్ని అటుకుల ఉప్మా అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుది. పోహాను కూడా ఉప్మా మాదిరి తయారు చేసుకుంటారు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
దలియా..
దలియాలో పోషకాలు పుష్కలంగ ఉంటాయి. ఇందులో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెల్లిగా అరుగుతుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగనివ్వవు. ఇందులో గింజలు కూడా వేసుకుంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇదీ చదవండి: మంచి నిద్ర కావాలంటే ఈ 5 మొక్కలు మీ బెడ్‌రూంలో ఉండాల్సిందే..
బేసన్ చిల్లా..
ఇది ప్యాన్ కేక్ మాదిరి తయారు చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా ఎక్కువగా బేసన్ చిల్లా రిసిపీని సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు చూశాం. ఇందులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బేసన్ చిల్లాలో పాలకూర, ఉల్లిపాయ,టమాట కూడా వేసుకుంటారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
మూంగ్ దాల్ చీలా..
పెసలతో తయారు చేసిన చీలాలో ప్రొటీన్, ఫైబర్, కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు.
ఉతప్పం..
ఉతప్పం కూడా దోశ పిండితో తయారు చేసుకుంటారు. దీనిపైనునంచి ఉల్లిపాయలు, టమాట, బెల్‌పెప్పర్ యాడ్ చేసుకుంటారు. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఇందులో జీఐ లెవల్స్ తక్కువగా ఉంటాయి.
ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే 7 బెస్ట్ హోం రెమిడీస్..
స్ప్రౌట్ సలాడ్..
మొలకలు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అని మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ముఖ్యంగా పెసలు, శనగలు, ఇతర ధాన్యాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter