7 Best Home Remedies For Gastric Problem: కడుపులో యాసిడిటీ పెరిగితే గ్యాస్ సమస్యలు వచ్చి జీర్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది డైటరీ ఫ్యాక్టర్, స్ట్రెస్, లైఫ్ స్టైల్ వలల్ వస్తంఉది. కొన్ని ఇంటి చిట్కాలతో యాసిడిటీ, గ్యాస్ సమస్య నుంచి సులభంగా బయటపడతారు.
సోంపునీరు..
సొంపునీటిలో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ప్రతిరోజూ తిన్నవెంటనే రెండు సోంపు గింజలను నమిలితే సరిపోతుంది. లేదా వేడినీళ్లలో సోంపు గింజలతో తయారుచేసిన పొడిని వేసి ఓ 15 నిమిషాల తర్వాత వడకట్టుకుని తాగాలి. ఇది కడుపులో యాసిడిటీ సమస్యకు చెక్ పెడతాయి.
చల్లని పాలు..
కడుపులో గ్యాస్ సమస్యకు చల్లనిపాలు ప్రభావవంతమైన రెమిడీ. ఇది కడుపులో గ్యాస్, మంట సమస్యకు చెక్ పెడతాఇయ. ఓ గ్లాసు చల్లనిపాలు తాగితే యాసిడిటీ సమస్య తగ్గిపోతుంది. కావాలంటే ఇందులో తేనె కలుపుకుని తీసుకోవాలి.
చమోమిలా టీ..
చమోమిలా టీలో ఆహ్లాదపరిచే గుణం ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని కూడా నివారిస్తుంది. చమోమిలా టీ బ్యాగులను వేడినీళ్లలో వేసి ఓ 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది మీకు ఎప్పుడు యాసిడిటీ సమస్య అనిపిస్తే తాగచ్చు.
యాపిల్ సైడర్ వెనిగర్..
యాసిల్ నేచర్ ఉంటే యాపిల్ సైడర్ వెనిగర్ కడుపులో యాసిడ్ లెవల్స్ నిర్వహిస్తుంది. రెండు టీ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఓ గ్లాసు నీటిలో వేసుకుని తాగాలి. అయితే, ఈ రెమిడీ ప్రయత్నించే ముందు ఎంత మోతాదులో తీసుకోవలన్నిది ఓసారి వైద్యులను కూడా సంప్రదించి తీసుకోవాలి.
ఇదీ చదవండి: ఈ రెండిటిలో ఏ బ్రేక్‌ఫాస్ట్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు..?
అల్లం టీ..
కడుపులో గ్యాస్ సమస్కు అల్లం కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో కడుపులో గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. మనం టీ తయారు చేసుకునేటప్పుడు అల్లం ముక్కలను వేసుకుంటే సరిపోతుంది. లేదా వేడినీటిలో అల్లం దంచుకుని వేసుకున్నా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఆ తర్వాత వడకట్టకుని ఆ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఇందులో రుచికోసం కాస్త నిమ్మకాయ రసం, తేనె కూడా వేసుకుని తాగవచ్చు. కడుపులో అజీర్తి సమస్య ఉన్నప్పుడు రోజు మూడు కప్పుల అల్లం టీ తీసుకోవచ్చు.
అరటిపండు..
అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను సమం చేస్తాయి. అంతేకాదు అరటిపండులో కూడా యాంటాసిడ్స్ ఉంటాయి. దీంతో కడుపులో అజీర్తి లక్షణాలకు చెక్ పెడతాయి. అరటిపండును యోగర్ట్‌తో కలిపి స్మూథీలా కూడా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: వంటింట్లోని ఈ 2 వస్తువులు.. బెల్లీఫ్యాట్ తగ్గడానికి కరెక్ట్ చిట్కా..!
కొబ్బరినీరు..
కొబ్బరి నీరు కూడా కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి. ఇందులో ముఖ్యంగా ఆల్కలైన్ ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను నిర్వహిస్తాయి. కొబ్బరి నీరు కడుపులో అసౌకర్యానికి ది బెస్ట్ రెమిడీ. డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే కొబ్బరినీరు తరచూ తాగుతూ ఉండాలి. ఇది మంచి ఎలక్ట్రొలైట్ మంచి జీర్ణ ఆరోగ్యానికి ఇవి ప్రేరేపిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter