Healthy Drink: చలికాలంలో ఈ మూడు కలిపి జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు..
ABC Juice In Winter: చలికాలంలో ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల తరుచు దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ABC Juice In Winter: చలికాలంలో చాలా మంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరంతో తరుచుగా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం రోగనిరోధకశక్తి తగ్గడం. రోగనిరోధశక్తి చలికాలంలో తగ్గుతుంది. ఈ సమయంలో పోషకరమైన ఆహారపదార్థాలను తీసుకోవడం ముఖ్యం. అయితే ప్రతిరోజు ఉదయం ఏబీసీ జ్యూస్ తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఏబీసీ జ్యూస్ అంటే ఆపిల్, బీట్‌రూట్ మరియు క్యారెట్‌ల కలయికతో తయారయ్యే ఒక పోషకాల నిధి. ఈ మూడు పదార్థాలు కలిసి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఈ జ్యూస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఏబీసీ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, చలి, జలుబు వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు శరీరంలోని రక్తనాళాలను విస్తరింపజేసి, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఆపిల్ , క్యారెట్‌లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ కళ్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. ఏబీసీ జ్యూస్‌లో ఉండే సహజ చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది.
ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేయాలి?
ఏబీసీ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. కేవలం ఆపిల్, ఒక బీట్‌రూట్, ఒక క్యారెట్, నీరు ఉంటే సరిపోతుంది.
కావలసిన పదార్థాలు:
ఒక ఆపిల్,
ఒక బీట్‌రూట్,
ఒక క్యారెట్,
నీరు
తయారీ విధానం:
అన్ని పదార్థాలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలను బ్లెండర్‌లో వేసి, కొద్దిగా నీరు కలిపి మిక్సీ చేయాలి. రుచికి తగినంత బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
ఏబీసీ జ్యూస్‌ను ఉదయం లేదా వ్యాయామం చేసిన తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.
షుగర్ వ్యాధి ఉన్నవారు తేనె లేదా బెల్లం కలుపుకోకుండా తాగవచ్చు.
ఏబీసీ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి