Acidity Remedies: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని పొట్ట సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. అయితే మార్కెట్‌లో లభించే అయిల్‌ఫుడ్‌ తీసుకోవడం వల్ల ప్రస్తుతం చాలా మంది మలబద్ధకం, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడు చాలా మందిలో ఈ వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నాయి. వీటితో ఉపశమనం పొందవచ్చు కానీ తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే వీటి కోసం పలు రకాల చిట్కాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లవంగం, ఏలకులు వల్ల ప్రయోజనాలున్నాయా..?


ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కడుపులో  ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి లవంగాలు, యాలకుల ప్రధాన పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో కార్మినేటివ్ అనే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. కావున మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.


ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగాలి:
శరీరంలో చిన్న పాటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి తేలికపాటి గోరువెచ్చని నీరు సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తాగాలి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయి శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.


పొట్ట సమస్యలకు యోగాసనాలు:


కడుపు నొప్పి, వికారం లేదా తరచుగా పుల్లని త్రేనుపుతో ఇబ్బంది పడుతుంటే.. మీరు ఉదయాన్నే యోగా భంగిమలను చేయాలి. అయితే వీటిలో నిద్రాణస్థితిలో ఉన్న కోణాసనం ఉత్తమమైనదిగా నిపుణులు పరిగణించారు. ఈ ఆసనాన్ని రిక్లైనింగ్ బౌండ్ యాంగిల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం జీర్ణవ్యవస్థ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది.


అల్లం:
పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి.. పొట్ట ఫిట్‌గా ఉండడానికి  సోపు గింజలు, పుదీనా ఆకులు, అల్లం ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే దీని కోసం ఒక బౌల్‌లో నీరు మరిగించి అందులో ఈ మూడు పదార్థాలను వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వీటిని ఉదయం పూట తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే  ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా సహాయపడుతుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook