Things to remember after COVID-19 recovery: న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు (Corona second wave symptoms) గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా జబ్బు ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం.. నీరసం, అలసట అలాగే ఉంటుండం వంటి లక్షణాలు ఇంకొంత ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని.. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నయమైన తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ ఓసారి చూద్దాం...


అసలే వేసవి కావడంతో శరీరంలో వాటల్ లెవల్స్ పడిపోకుండా తగిన మోతాదులో గోరువెచ్చటి నీళ్లు (Take warm water) తీసుకోవాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయి తరచుగా అలసటబారినపడతారు.


కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు తీసుకుంటే ఇంకా మంచిది. నారింజ, యాపిల్‌‌, దానిమ్మ, బొప్పాయి పండ్లు తినాలి. జ్యూస్‌‌ (Fruit juices) చేసుకుని కూడా తాగొచ్చు. అయితే, అదే సమయంలో డయాబెటిస్ పేషెంట్స్ (Diabetic patients) షుగర్ అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండటం మర్చిపోవద్దు.


Also read : Co-Win Registration: కరోనా టీకాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడెక్కడ చేసుకోవాలో తెలుసా


కూరగాయలు (Vegetables) ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బీట్‌‌రూట్, బచ్చలికూర, టమాటాలు లాంటి కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి బలహీనతను తగ్గించేందుకు దోహదపడతాయి.
 
పాలల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకునే ముందు పాలు (Milk health benefits) తాగాలి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. 


కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా కనిపిస్తున్న లక్షణాల్లో (Corona second wave symptoms) జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించేవే ఎక్కువగా ఉన్నాయి. కరోనా తర్వాత జీర్ణ వ్యవస్థ సాధారణ స్థాయికి రావడానికి సమయం పడుతున్నందున తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
 
విటమిన్ సీ, విటమిన్ డి (Vitamin C, Vitamin D) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అవి ఆహారం రూపంలో లభించనన్న పక్షంలో విటమిన్ ట్యాబ్లెట్స్ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే, విటమిన్స్ ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు డాక్టర్ల సూచనలు తీసుకోవాలి. పేషెంట్ హిస్టరీనిబట్టి అవి కొనసాగించవచ్చా లేదా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. 


Also read : Corona Diet: కరోనా సోకిన రోగులు ఏం తినాలి, ఏం తినకూడదు..చికెన్, గుడ్ల వల్ల లాభముందా


శరీరానికి వ్యాయమం ఎప్పుడూ అవసరమే. అలాగే కరోనా రికవరి తర్వాత కూడా వ్యాయమం కొనసాగించాలి. అయితే మరీ ఎక్కువగా అలసిపోయే ఎక్సర్‌సైజుల (Exercises after COVID-19 recovery) జోలికి వెళ్లకపోవడమే మంచిది.


శరీరానికి తగినంత నిద్ర (Sleeping), విశ్రాంతి అవసరం. లేదంటే త్వరగా అలసిపోయే ప్రమాదం ఉంది.


ఎప్పటిలాగే మాస్కు ధరించడం (Wearing mask), సోషల్ డిస్టన్సింగ్ పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను శానిటైజ్ చేయడం తప్పనిసరి అలవాట్లుగా మార్చుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook