Almond Milk: బాదంతో థైరాయిడ్ వస్తుందా, బాదం ఎవరెవరు తినకూడదు
Almond Milk: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ పేరు వినగానే గుర్తొచ్చేది బాదం. అయితే బాదం అందరికీ మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Almond Milk: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ పేరు వినగానే గుర్తొచ్చేది బాదం. అయితే బాదం అందరికీ మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
బాదంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకలకు పటిష్ఠత, బరువు అదుపులో ఉండటం, మానసికంగా సమతుల్యత, గుండె జబ్బులు, కేన్సర్ నియంత్రణలో ఉంటాయి. అందుకే మెరుగైన ఆరోగ్యం కోసం బాదం తీసుకోవాలని చెబుతారు.
అయితే బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే..మితిమీరి తీసుకుంటే మాత్రం చాలా సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ సమస్యలేంటనేది పరిశీలిద్దాం.
బాదంతో దుష్పరిణామాలు
బాదం పరిమితికి మించి అధికంగా తీసుకుంటే..మినరల్స్, న్యూట్రియంట్స్ పరిమితి పెరిగి వాంతులు రావడం, కడుపులో అసౌకర్యం, విరేచనాలు, పేగు అనారోగ్యం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మితంగా తీసుకోవడం మంచిది. నట్స్ అలర్జీ ఉన్నవారు బాదం పాలు తీసుకోకపోవడమే మంచిది. లాక్టోస్ అలర్జీ ఉన్నవారు కూడా బాదం పాలకు దూరంగా ఉంటే మంచిది. ఆవుపాలలో కంటే బాదం పాలలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు బాదం తక్కువ తీసుకోవాలి.
బాదంతో థైరాయిడ్ వస్తుందా
బాదం పాలను గోయిట్రోజెనిక్ ఆహారంగా పరిగణిస్తారు. అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి. బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్‌కు హాని కల్గించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి. బాదంపాలను కొంతమంది అవగాహన లేక..తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా భావిస్తుంటారు. కానీ బాదం పాలు పిల్లలకు అంత మేలు చేసేది కానే కాదు.
Also read: Vitamin E Benefits: ఆ ఒక్క విటమిన్ ఉంటే చాలు, వృద్ధాప్య ఛాయలే కన్పంచవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook