Vitamin E Benefits: మెరుగైన ఆరోగ్యం ఉండాలంటే పోషక పదార్ధాలు, విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ ఇ ఉంటే చాలా మంచిది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా..నిత్య యవ్వనంగా కన్పిస్తారు.
ప్రకృతిలో విరివిగా లభించే వివిధ రకాల ఆహార పదార్ధాల్లో ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ముఖ్యమైంది విటమిన్ ఇ. ఎందుకంటే విటమిన్ ఇ అనేది కంటికి, చర్మ సంరక్షణకు అన్నింటికీ మంచిది. విటమన్ ఇ శరీరానికి ఎంత అవసరం, ఎందులో పుష్కలంగా లభిస్తుందనే తెలుసుకుందాం..
విటమిన్ ఇ లోపంతో రెండు సమస్యలు వెంటాడుతాయి. ఒకటి చర్మ సంబంధిత వ్యాధులు. రెండవది కంటి చూపు సమస్య. మనిషి శరీరం మెకానిజంను బలోపేతం చేయడంలో ఈ విటమిన్ చాలా దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించేది విటమిన్ ఇ మాత్రమే. అందుకో దైనందిన ఆహారంలో తప్పకుండా విటమిన్ ఇ ఉండేట్టు చూసుకోవాలి.
మొదటిది బాదం. ఇందులో అనేక పోషకాలుంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక స్థాయిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రక్షిస్తుంది. అన్ని రకాల యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో ఉంటాయి. మరోవైపు బాదంలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇక రెండవది హాజెల్ నట్స్. ఇందులో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. సెల్ డ్యామేజ్ నుంచి నూటికి నూరుశాతం రక్షణ అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. హాజెల్ నట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.
ఇక మూడవది సన్ ఫ్లవర్ ఆయిల్. బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. సన్ ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. నాలుగవది అవకాడో. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే పండు. శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ అన్నీ ఉంటాయి.
విటమిన్ ఇ అనేది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. దాంతో వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. నిత్య యవ్వనంగా కన్పిస్తారు. అందుకే చాలావరకూ బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో విటమిన్ ఇ ప్రాముఖ్యత వివరిస్తుంటారు.
Also read: Belly Fat Reasons: బెల్లీఫ్యాట్ ఎందుకొస్తుంది, తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook