నేరేడు పండు శాస్త్రీయ నాయం  'షైజీజియం క్యుమిని'. ఈ చెట్టును ఎక్కువగా పండ్ల కోసం పెంచుతారు. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట.. దీని గురించి రాలయంలో కూడా ప్రస్తావించారు. 14ఏళ్ల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లను తిన్నాడని భారతీయుల విశ్వాసం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు


* ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండటానికి  నేరేడు పండు ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. షుగర్ పేషంట్లకు ఇది మస్త్ యూజట. 


* మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నావాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. 


* గర్భిణీ తింటే తల్లికీ, బిడ్డకీ మంచిది.  మెదడును చురుగ్గా ఉంచడానికి, హార్ట్ బీట్ సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. 


* నేరేడులో విటమిన్ సీ,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. 


* కాల్షియం, పొటాసియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. 


* ఈ పండు ఆకుల్ని దంచి కషాయంగా కాచి నోట్లో వేసుకొని పుక్కలిస్తే దంత, చిగుళ్ల సమస్యలు రావు. 


* ఆకు రసంలో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట, దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం కలుగుతుంది. 


* జిగట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాలా నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే రోగి శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటాయి. 


* జ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. 


* నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే.. త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. 


... ఇదండీ నేరేడు పండ్లకు సంబంధించిన కొన్ని ప్రయోజనాలు. మీరూ తప్పకుండా ప్రయత్నించండి.