Sunflower seeds health benefits: సన్‌ఫ్లవర్ సీడ్స్ పోషకాలకు పవర్ హౌజ్ అంటారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనా గురించి ఇటీవల సెలబ్రిటీలు కూడా మాట్లాడటం మనం చూశాం.  నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్‌ఫ్లవర్ సీగ్స్ మన డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సన్ ఫ్లవర్ సీడ్స్‌ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోడ్య ప్రయోజనాలు కలుగుతాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్ సలాడ్స్, టాపింగ్ పైభాగంలో వేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌ఫ్లవర్ సీడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.ప్రతిరోజూ 35 గ్రాములు చేర్చుకోవాలి. ఇది షుగర్, డయబెటిస్ ఉన్నవాళ్లు తినవచ్చు. సన్ ఫ్లవర్ సీడ్స్ లో పాలి అన్‌ శాచురేటెడ్‌ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులోని ఫ్యాట్‌ కొలెస్ట్రాల్ స్థాయిలు,  బీపీని అదుపులో ఉంచుతాయి. ఒక్క సర్వీంగ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ బౌల్లో 3 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది.  షుగర్ నిర్వహణ, పేగు ఆరోగ్యానికి మంచిది.సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఐరన్, మ్యాంగనీస్, సెలీనియం ఉంటుంది. మీ డైట్లో సన్‌ఫ్లవర్ సీడ్స్ చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి.


ఇదీ చదవండి: చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా? ఇలా చేయండి మైనంలా కరిగిపోతుంది..


పోషకాల పవర్‌హౌజ్..
సన్‌ఫ్లవర్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా గుండె సమస్యలను రాకుండా చెక్ పెడతాయి. ఇందులోని మెగ్నీషియం బీపీ స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి.


జీర్ణ ఆరోగ్యం..
సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి ప్రేరేపించి, మలబద్ధకం సమస్యలు రాకుండా కాపాడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతం చేస్తాయి.అందుకే సన్‌ ఫ్లవర్ సీడ్స్‌ మీ డైట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఇది కడుపు సమస్యలు రాకుండా కూడా కపాడుతుంది.


ఇదీ చదవండి: వాల్ నట్స్ నానబెట్టి ఎందుకు తినాలి? అసలైన కారణం ఇదే..


ఇమ్యూనిటీ..
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, సెలీనియం సమతులం చేస్తాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. దీంతో ప్రాణాంతక వ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ తగ్గిపోతాయి. ఇమ్యూనిటీపై నే మన శరీరం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. సన్‌ ఫ్లవర్ సీడ్స్ డైట్లో చేర్చకోవడం వల్ల ఇమ్యూనటీ పరంగా కూడా లాభాలు పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook