Sweet Potato Benefits in Telugu: చిలగడదుంపలు చలికాలం రాగానే మార్కెట్లో కనిపిస్తాయి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంప వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగ ఉంటుంది ప్రొటీన్, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ పోషకాల నిధిని మీ డైట్లో తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచనలిస్తారు.బరువు తగ్గాలనుకునేవారికి చిలగడ దుంప ఎంతో ఉపకరం. ముఖ్యంగా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే త్వరగా ఆకలి వేయదు. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. మీ వెయిట్ లాస్ జర్నీలో చిలగడదుంప ఎంతో ఉపకరంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. కేరల్ మాదిరి చిలగడ దుంప కూడా కంటిచూపు మెరుగ్గా ఉండటానికి దోహదం చేస్తుంది.ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు చిలగడ దుంపను తమ డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషయం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది కీళ్లు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుది. చాలావరకు మనం చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని తింటాం. కాబట్టి ఇందులో ఆయిల్ వాడం. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


చిలగడదుంపలో ఉండే కెరటనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు చిలగడదుంపను తినవచ్చు. దీంతో ఇందులో ఉండే పోషకాలు వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. 


ఇదీ చదవండి: ఈ వ్యాధి ఉన్నవారు జామ పండు అసలు తినకూడదు..!


మొత్తానికి చిలగడం దుంపలో ఐరన్, ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో అనీమియా సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా ఎముకలు బలహానంగా ఉండేవారు చిలగడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవాలి.


ఇదీ చదవండి: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌


ఆరోగ్యపరంగానే కాదు, చిలగడదుంప సౌందర్యపరంగా కూడా అనేక లాభాలనిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చిలగడదుంప వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter