Dried Fruit: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌

Dried Fruit Benefits: డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి  కావాల్సిన పోషకాలు అందుతాయి. అంతేకాకుండా దీని వల్ల రుగ్మతలు తొలుగుతాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2024, 10:19 AM IST
Dried Fruit: ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు..‌

Dried Fruit Benefits: మనలో చాలా మంది డ్రైఫ్రూట్స్‌ అనగానే జీడిపప్పు, బాదం, పిస్తాగా పరిగణిస్తుంటారు. వీటిని ప్రతిరోజు తీసుకోకుండా కేవలం ఎప్పుడో ఒకసారి తింటారు. మీరు వాటిని ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు  గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

వీటితో పాటు ఎండు డ్రై ఫ్రూట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి. అలాగే ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల రక్తం గట్టిపడకుండా సహాయపడుతుంది. దీనినిలో  ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మహిళలు తీసుకుంటే ఐరన్ లోపాన్ని జయించవచ్చు. ఇలా ఇతర డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.     అయితే డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

ప్రయోజనాలను:

రోగనిరోధక శక్తి పెంచడం:

విటమిన్లు , మినరల్స్‌ లవణాలు వంటి రోగనిరోధక శక్తికి ఉపయోగపడే పోషకాలతో డ్రై ఫ్రూట్స్ నిండి ఉంటాయి. ఇవి జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతాయి. 

శరీరాన్ని బలంగా ఉంచడానికి  సహాయపడతాయి:

 డ్రై ఫ్రూట్స్‌లోని ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి  గాయాలు మానడానికి అవసరమవుతాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడటం: 

డ్రై ఫ్రూట్స్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్  తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడతాయి. 

బరువు తగ్గించడంలో సహాయపడటం:

 డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్  అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేయడానికి సహాయపడటమే కాకుండా, ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఫలితంగా, డ్రై ఫ్రూట్స్ మితంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

చర్మాన్ని కాంతివంతంగా ఉంచడం:

డ్రై ఫ్రూట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను నష్టం నుండి కాపాడి, ముడతలు రాకుండా చేస్తాయి. కే కాకుండా, డ్రై ఫ్రూట్స్‌లోని కొవ్వులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

మెదడు పనితీరును మెరుగుపరచడం:

డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. మెదడు మెరుగా పెంపొందించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. 

బలం, ఊపిరితిత్తుల ఆరోగ్యం:

డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన శరీరానికి బలం చేకూరుస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి.

మధుమేహం:

కొన్ని డ్రై ఫ్రూట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

మెదడు పనితీరు:

డ్రై ఫ్రూట్స్‌లో మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడే పోషకాలు ఉంటాయి.

అంతేకాకుండా, డ్రై ఫ్రూట్స్‌లో ఎముకల దృఢత్వానికి కావల్సిన కాల్షియం  కూడా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ చిన్న పిల్లల నుంచి  పెద్దవారి వరకు అందరికీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News