Amazing Home Remedies For Acidity Easy Tips To Reduce The Pain: ప్రస్తుతం ఎసిడిటీ సమస్య ఎక్కువైపోయింది. అందుకు ప్రస్తుత జీవనశైలి ప్రధాన కారణం. ఎసిడిటీతో తరచుగా గుండె, కడుపు, గొంతులో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి తీవ్ర అనారోగ్యానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సమయానికి తిని.. భోజనం తర్వాత కనీసం అరగంట పాటు నిటారుగా కూర్చోవడం వంటి చిన్నచిన్న అలవాట్లు పాటిస్తే ఎసిడిటీ నుంచి కాస్త బయటపడవచ్చు. ఇక మన వంటగదిలో ఉండే కొన్ని పదార్ధాలతో ఎసిడిటీని నియంత్రించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాము 


వాములో బయోకెమికల్‌ థైమోల్ (Biochemical thymol) ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ (Gastric) సమస్యలను తగ్గిస్తోంది. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒక స్పూన్‌ వాములో చిటికెడు ఉప్పు (Salt) కలిపి తింటే ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే గ్లాస్‌ నీళ్లలో టీ స్పూన్‌ వాము కలిపి, ఒక గంట నానబెట్టి, రాత్రి నిద్రపోయే ముందు తాగినా కూడా మంచి ఫలితముంటుంది.


సోంపు గింజలు


భోజనం చేశాక కాస్త సోంపు గింజలు (anise seeds) తీసుకుంటే నోటి దుర్వాసన పోవడంతో పాటు మెరుగైన జీర్ణక్రియ జరుగుతుంది. పిల్లల్లో తరచూ వచ్చే కడుపునొప్పి ఉపశమనానికి సోంపు, పటిక బెల్లం మిశ్రమం బాగా పనిచేస్తుంది. సోంపు గింజలతో (anise seeds tea) టీ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


Also Read : T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్


తేనె


గ్లాస్‌ నీళ్లలో టీస్పూన్‌ తేనె (Honey) కలిపి తాగితే కూడా ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ఈ మిశ్రమానికి కొంచెం నిమ్మరసం కలిపి తాగితే కడుపులో పుల్లని త్రేన్పులకు కారణయ్యే ఆమ్లాలను తగ్గిస్తుంది.


కొత్తిమీర


కొత్తిమీర (Coriander) ఆకులను ఏ విధంగా తీసుకున్నా ఎసిడిటీని తగ్గుతుంది. కాస్త కొత్తిమీర రసాన్ని.. నీళ్లలో లేదంటే మజ్జిగలోగానీ (Buttermilk) కలిపి తాగితే ఎసిడిటీ (Acidity) వెంటనే ఉపశమనం పొందవచ్చు. కొత్తిమీర ఆకులతో తయారుచేసిన టీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే వాంతులు, విరేచనాలను తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.


పాలు, పెరుగు


పుల్లని త్రేన్పులకు చక్కటి విరుగుడుగా పాలు (Milk) పని చేస్తాయి. గోరు వెచ్చని లేదా చల్లని పాలు ఎసిడిటీకి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. పాలు సహజ యాంటాసిడ్‌లా పని చేస్తాయి. పాలల్లో కాల్షియం అధికంగా ఉండటంతో అది యాసిడ్‌ను వెంటనే తగ్గించగలుతుంది. అలాగే పెరుగులో (curd) కూడా కాల్షియంతో పాటు, సహజమైన ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు పెరుగు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలతో ఎసిడిటీ (Acidity) నుంచి బయటపడొచ్చు.


Also Read : Gold smuggling: ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ స్మార్ట్‌ఫోన్లలో 5 కిలోల గోల్డ్ స్మగ్లింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి