Stress Relieving Foods: ఈ మధ్యకాలంలో వర్క్‌ లేదా పర్సనల్ రిలేషిన్‌ షిప్‌ వల్ల విపరీతమైన స్ట్రెస్‌, యాంగ్జైటీతో బాధపడాల్సి వస్తుంది. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. దీనివల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. విపరీతమైన స్ట్రెస్‌ వల్ల మానసిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం పడుతుంది. అయితే, కొన్ని రకాల ఆహారాల తీసుకుంటే స్ట్రెస్, డిప్రెషన్‌ నుంచి సులభంగా బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెర్రీపండ్లు..
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కణాలు పాడవ్వకుండా కాపాడతాయి. స్ట్రెస్‌ యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి కూడా బయటపడాలంటే బెర్రీజాతి పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


జీడిపప్పు..
జీడిపప్పులో జింక్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి బ్రెయిన్ ఫుడ్. మెదడు పనతీరుకు సహాయపడతాయి జీడిపప్పులు. మన డైట్లో జీడిపప్పు చేర్చుకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ సమస్యల నుంచి కూడా బయటపడతారు.


చీయా సీడ్స్..
ఎండకాలం ఎంతో ఇష్టం తినే చీయా సీడ్స్ కూడా స్ట్రెస్‌ యంగ్జైటీ నుంచి బయటపడేస్తాయి. ముఖ్యంగా జింక్ లేమితో బాధపడేవారు చీయా సీడ్స్ డైట్లో చేర్చకోవాలి. చీయా సీడ్స్, గుమ్మడి గింజలు, గుడ్లలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా మంచివి.


గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ట్రైప్టోఫన్, అమైనో యాసిడ్స్ సెరోటొనిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. గుడ్లను డైట్లో చేర్చుకున్నా యాంగ్జైటీ నుంచి బయటపడటానికి కాపాడతాయి.


అవకాడో..
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సీ, ఇవి స్ట్రెస్‌ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు ఆరోగ్యానికి తోడ్పడి స్థిరంగా ఉండేలా చేస్తాయి.


ఇదీ చదవండి: ఈ ఆకుతో అధిక చక్కెరకు చెక్.. ఇదే షుగర్‌కు ఎఫెక్టీవ్‌ హోం రెమిడీ..!


ఆకుకూరలు..
పాలకూర, కాలే, బ్రొకోలీలో న్యూట్రియేంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్, యాంగ్జైటీ స్థాయిలు తగ్గడానికి కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ఆకుకూరలు ఆహారంలో చేర్చుకుంటే టెన్షన్, యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చు.


సాల్మాన్..
సాల్మాన్ చేపలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది డిప్రెషన్ బారినపడకుండా కాపాడుతుంది. ఈ ఫ్యాటీ ఫిష్ డైట్లో చేర్చుకుంటే మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది.


ఇదీ చదవండి: ఒక్క దానిమ్మతో 100 రోగాలు పరార్.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..


డైరీ..
పాలు, పెరుగు, చీజ్ లో ట్రిప్టోఫన్, విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా స్ట్రెస్‌ లెవల్స్ తగ్గించి మంచి నిద్రకు సహాయపడుతుంది. డైరీ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook