Guava Leaves for High Sugar: ఈ ఆకుతో అధిక చక్కెరకు చెక్.. ఇదే షుగర్‌కు ఎఫెక్టీవ్‌ హోం రెమిడీ..!

Guava Leaves for High Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారు ఎన్నో మందులు తీసుకుంటారు. అయితే, దీనికి జీవనశైలిలో మార్పు కూడా అవసరం. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.

Guava Leaves for High Sugar: డయాబెటిస్‌తో బాధపడేవారు ఎన్నో మందులు తీసుకుంటారు. అయితే, దీనికి జీవనశైలిలో మార్పు కూడా అవసరం. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. మందులు కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఆకులతో కూడా షుగర్ నియంత్రించవచ్చు. సాధారణంగా మనం జామకాయలను తింటాం. ఇవి తీయగా రుచిగా ఉంటాయి.
 

1 /6

షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా జామకాయలను తినవచ్చని నిపుణులు సూచిస్తారు. అయితే, జామకాయలు కాకుండా జామ ఆకులు కూడా షుగర్ వ్యాధికి చెక్ పెడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. అది ఎలానో తెలుసుకుందాం.  

2 /6

సహజసిద్ధమైన జామ ఆకులతో రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉండటమే కాదు. బరువు కూడా సులభంగా తగ్గిపోతారు. జామ ఆకులతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు.  

3 /6

జామ ఆకులను తీసుకునే సరైన విధానం కూడా తెలిసి ఉండాలి. జామ ఆకులు, అల్లం రెండిటినీ కలిపి జామ ఆకు టీ కూడా తయారు చేసుకోవచ్చు. అల్లంలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.   

4 /6

ముఖ్యంగా జామ ఆకుల్లో విటమిన్ బీ, సీ పుష్కలంగా ఉంటాయి. ఇక అల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు సులభంగా తగ్గిపోతారు.   

5 /6

అల్లం, జామ ఆకులు రెండూ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సమర్థవంతంగా పోరాడుతాయి. జామలో యాంటీ డయాబెటిక్‌, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.  

6 /6

జామ ఆకులు, అల్లం రెండూ మిశ్రమంగా కలిపి తీసుకోవడం వల్ల జలుబు, గొంతునొప్పి సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చు. జామ ఆకుల రసం, అల్లం రసం రెండూ సమపాళ్లలో కలిపి కూడా తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )