Side Effects Of Turmeric: వీళ్లు పసుపు తీసుకుంటే యమ డేంజర్.. ఈ సమస్యలు ఉంటే దూరంగా ఉండండి
Turmeric Side Effects In Telugu: మన వంటకాల్లో పసుపు వాడకం సర్వసాధారణం. పసుపు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం పసుపునకు మాత్రం దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరంటే..?
Turmeric Side Effects In Telugu: పసుపు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు పలు సమస్యలను దూరం చేస్తాయి. గుండె, గట్, మెదడుకు ఎన్నో లాభాలను చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యముగా పచ్చి పసుపు మరింతగా మేలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఈ కారణంగానే పచ్చి పసుపును జ్యూస్‌ల్లోనూ, వేడి పాలల్లోనూ, వంటల్లో , ఊరగాయలు, రోజువారీ చట్నీలలోను, పులుసులోను ఇలా అనేకరకాలుగా డైట్లో మైంటైన్ చేస్తుంటారు చాలా మంది. అయితే మీరు ఇక్కడే ఒక్కటి తెలుసుకోవాలి. పసుపు ఎంతగా మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం పసుపు సప్లిమెంట్లకు దూరంగా ఉండటం మంచిదట. ఏ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపుకి దూరంగా ఉండాలి..? ఒకవేళ ఆ ఆరోగ్య సమస్యలున్నవారు పసుపును వాడితే ఏమవుతుంది. ఇపుడు మనం తెలుసుకుందాం..
శస్త్రచికిత్సలు చేసుకునేవారు..
ఆరోగ్యపరంగా సర్జరీలు చేయించుకోవాలనుకునే వారు పసుపు, పసుపు సప్లిమెంట్లను తప్పకుండా మానేయాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. దీనికి గల కారణం చూస్కుంటే రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్లే సర్జరీ షెడ్యూల్ దగ్గరగా ఉన్నప్పుడు పసుపు మానేయాలి.
డయాబెటిస్ ఉన్నవారు..
డయాబెటిస్ ఉన్నవాళ్లు పసుపును దాదాపుగా తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. డయాబెటిస్‌తో బాధపడుతూ.. మందులు వాడుతున్నవారు పసుపును వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయట. చక్కెర స్థాయిలను తగ్గించుకునేందుకే మందులు తీసుకుంటుంటే, పసుపు కూడా షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇలా మరింతగా చక్కరస్థాయి తగ్గిపోతే ఆరోగ్యం మరింతగా దెబ్బ తింటుందని డాక్టర్స్ అంటున్నారు . డయాబెటిస్ మందులు వినియోగించేవారు, పసుపును వాడటం తగ్గిస్తే మంచిది.
ఐరన్ లోపం ఉన్న వారు..
ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు తమ డైట్లో పసుపును కొంతవరకు తగ్గిస్తే మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం చేసుకుంటే పసుపు జీర్ణాశయంలోని ఐరన్ శోషణను ప్రభావితం చేస్తుందని తెలిపింది. పసుపును రోజు వారి కార్యక్రమంలో కొంతవరకు తగ్గించి తీసుకుంటే మంచిది. అదేవిధంగా జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్నవారు.. మెడిసిన్ వాడుతున్నట్లైతే పసుపు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే కడుపులో ఆమ్ల స్థాయిలను పసుపు పెంచుతుందని అంటున్నారు. దీంతో వాడుతున్న మందుల ప్రభావం తగ్గుతుందట.
వీటితో పాటు పిత్తాశయం సమస్యలతో బాధపడుతున్నవారు, కిడ్నీలలో రాళ్లతో బాధ పడుతున్నవారు, అలెర్జీతో బాధ పడుతున్నవారు ప్రెగ్నన్సీతో ఉన్నవారు , పాలిచ్చే వారు.. పసుపును తగ్గించుకుంటే మంచిదని కొన్ని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా పసుపు ను ఎలాంటి సమస్యలు లేనివారు తీసుకున్నప్పటికీ దానిని లిమిట్‌గా వాడాలట. క్కువ మొత్తంలో తీసుకుంటే ఇప్పుడు తెలియకపోయినప్పటికీ తరువాత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారట.
Also Read: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా..
Also Read: YSRCP 6th List: కొనసాగుతున్న వైసీపీ 'మార్పులు'.. మార్గాని భరత్, వసంతకు భారీ షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter