YSRCP 6th List: కొనసాగుతున్న వైసీపీ 'మార్పులు'.. మార్గాని భరత్‌, వసంతకు భారీ షాక్‌

YSRCP Candidates List: రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థులను మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా మార్పుచేసిన వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. వీటిలో కీలకమైన మార్పులు చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 2, 2024, 10:06 PM IST
YSRCP 6th List: కొనసాగుతున్న వైసీపీ 'మార్పులు'.. మార్గాని భరత్‌, వసంతకు భారీ షాక్‌

Margani Bharath, Vasanta Krishna Prasad: సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సరికొత్త వ్యూహాలతో రాజకీయాలను రసకందాయంగా మారుస్తున్నారు. 'భీమిలి' సభతో ఎన్నికలకు 'సిద్ధం' అని ప్రకటించిన జగన్‌.. ఇక పార్టీ అభ్యర్థుల ఎంపికను ఒక కొలిక్కి తీసుకువస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా అభ్యర్థులను మార్చివేస్తున్నారు. ఇప్పటిదాకా ఐదు విడతలుగా అభ్యర్థులను మార్చిన జగన్‌ తాజాగా ఆరో విడతలో కూడా అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైసీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. ఈసారి నాలుగు లోక్‌సభ, 6 అసెంబ్లీ సెగ్మెంట్‌లకు పార్టీ ఇన్‌చార్జ్‌లను మార్చారు. ఇప్పటివరకు 66 ఎమ్మెల్యే, 16 ఎంపీ అభ్యర్థులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 6 జాబితాల్లో కలిపి 33 మంది సిట్టింగులకు టికెట్ గల్లంతయ్యాయి.

తాజా జాబితాలో భారీ మార్పులు ఉన్నాయి. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న యువ నాయకుడు మార్గాని భరత్‌కు ఈసారి జగన్‌ నిరాకరించారు. రాజమండి ఎంపీ స్థానంలో గూడూరి శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. ఇక 2014లో పార్టీ నంద్యాల ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక 2019 సమయంలో పార్టీ ఫిరాయించింది. తర్వాత టీడీపీలో చేరి కొన్నాళ్ల పాటు కొనసాగారు. తిరిగి పార్టీలో చేరిన బుట్టా రేణుకకు మరోసారి జగన్‌ టికెట్‌ ఇచ్చారు. ఈసారి ఎంపీ టికెట్‌ కాకుండా ఎమ్మిగనూర్‌ అసెంబ్లీకి ఎంపిక చేయడం గమనార్హం.

ఇక ఎన్టీఆర్‌ జిల్లాలో కీలకమైన మైలవరంలో జగన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. సీనియర్‌ నాయకుడైన వసంత కృష్ణ ప్రసాద్‌కు టికెట్‌ నిరాకరించారు. ఈ స్థానంలో బీసీ వర్గానికి టికెట్‌ కేటాయించారు. సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను అభ్యర్థిగా తాజా జాబితాలో ప్రకటించడం విశేషం. ఇక్కడ టీడీపీ నుంచి బలమైన నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ఉన్నారు. మరి ఉమను ఢీకొట్టడానికి బీసీ అస్త్రాన్ని ప్రయోగించడం విశేషం.
 

ఆరో విడత జాబితా ఇదే

పార్లమెంట్ స్థానాలు
రాజమండ్రి- డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌
నర్సాపురం- న్యాయవాది గూడురి ఉమాబాల
గుంటూరు - ఉమ్మారెడ్డి వెంకటరమణ
చిత్తూరు (ఎస్సీ)- ఎన్‌ రెడ్డప్ప

అసెంబ్లీ స్థానాలు
మైలవరం- సర్నాల తిరుపతి రావు యాదవ్‌
మార్కాపురం- అన్నా రాంబాబు
గిద్దలూరు- కె నాగార్జున రెడ్డి
నెల్లూరు పట్టణం- ఎండీ ఖలీల్‌ (డిప్యూటీ మేయర్‌)
గంగాధర నెల్లూరు- కె నారాయణ స్వామి
ఎమ్మిగనూరు- బుట్టా రేణుక

Also Read: Gaddar Awards: 'గద్దర్‌ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్‌ బాబు ఏమన్నారంటే..?

Also Read: KTR Letter To Revanth: ఆటో డ్రైవర్లు చస్తుంటే కనికరం లేదా సీఎం రేవంత్‌ రెడ్డి? మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News