Pfizer Vaccine: ఇండియా వేరియంట్‌పై ప్రభావం చూపుతున్న ఫైజర్ మరియు ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్లు
AstraZeneca COVID-19 Vaccine: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెంది గత ఏడాదితో పోల్చితే కోవిడ్19 మరణాలు అధికంగా సంభవించాయి. దానికితోడు ఇటీవల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని కొత్త సమస్యలు వైద్య రంగానికి సరికొత్త సవాల్‌గా మారుతున్నాయి.
గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన తరువాత వైరస్ ఇదివరకే పలుమార్లు పరివర్తనం చెందింది. దీంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెంది గత ఏడాదితో పోల్చితే కోవిడ్19 మరణాలు అధికంగా సంభవించాయి. దానికితోడు ఇటీవల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ అని కొత్త సమస్యలు వైద్య రంగానికి సరికొత్త సవాల్‌గా మారుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ చేసిన సర్వేలో భారత్‌లోని కరోనా వేరియంట్‌పై ఏ వ్యాక్సిన్లు అధిక ప్రభావం చూపి, సత్ఫలితాలు ఇస్తున్నాయో తేలింది.
ఫైజర్ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్లు భారత్ వేరియంట్‌గా చెబుతున్న B16172 కరోనా వేరియంట్‌పై మెరుగ్గా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో గుర్తించారు. భారత వేరియంట్‌తో పాటు యూకే వేరియంట్‌గా పేర్కొంటున్న B117పై సైతం ఫైజర్, ఆస్ట్రాజెనెకా కోవిడ్19 వ్యాక్సిన్లు (AstraZeneca COVID-19 Vaccine) మెరుగైన ఫలితాలు సాధించాయని ఆదివారం నాడు బీబీసీ రిపోర్ట్ చేసింది. భారత వేరియంట్‌పై వ్యాక్సిన్ తొలి డోసు అనంతరం 33 శాతం ప్రభావం చూపగా, యూకే కరోనా వేరియంట్‌పై కోవిడ్19 వ్యాక్సిన్ తొలి డోసు అనంతరం 50 శాతం రక్షణ వ్యవస్థ మెరుగైందని పేర్కొన్నారు.
Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు
కరోనాపై పోరాటంలో భాగంగా ఉత్పత్తి చేసిన ఫైజర్ (Pfizer COVID-19 Vaccine), ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నట్లు కోవిడ్19 బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోవడం, మరణాలు సంభవించడం చాలా వరకు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రపంచంలో అత్యుత్తమ వ్యాక్సిన్లలో కోవిషీల్డ్‌కు చోటు దక్కింది. కానీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో కోవాగ్జిన్ తీసుకున్న వారిని తమ దేశంలోకి కొన్ని దేశాలు అనుమతి ఇవ్వడం లేదు.
Also Read: Covid-19 Symptoms: ఆ కరోనా బాధితులకు Steroids వాడకూడదు, ప్రముఖ వైద్యుడి సలహా
ఏప్రిల్ 5 నుంచి మే 16 తేదీల మధ్య 12,675 మందిపై పరిశోధకులు సర్వే చేశారు. అందులో 11,621 మందిలో B117 వేరియంట్‌ను, 1,054 మందిలో B16172 కరోనా వేరియంట్‌ను గుర్తించారు. అన్ని వయసుల వారిపై రీసెర్చ్ చేసి రిపోర్ట్ తయారు చేసినట్లు పీహెచ్ఈ తెలిపింది. రెండో డోసు తీసుకున్న తరువాత ఫైజర్ వ్యాక్సిన్ భారత వేరియంట్‌పై 88 శాతం ప్రభావం చూపుతుందని తేలింది. యూకే వేరియంట్2పై 93 శాతం ఫలితాలు ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా కోవిడ్19 వ్యాక్సిన్ భారత వేరియంట్‌పై 60 శాతం ప్రభావం చూపగా, యూకే వేరియంట్‌పై 66 శాతం మెరుగైన ఫలితాలు వచ్చాయని నివేదికలో పేర్కొంది.
Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook