Back Pain Remedies: తరచూ నడుము నొప్పి బాధిస్తోందా..ఈ 5 సులభమైన చిట్కాలతో మాయం
Back Pain Remedies: మీకు తరచూ నడుము నొప్పి బాధిస్తోందా..తీవ్ర ఇబ్బంది కల్గించే ఈ సమస్య నుంచి 5 సులభమైన చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
రోజూ మనం చేసే పనుల వల్ల లేదా గంటల తరబడి ఒకే పోశ్చర్‌లో కూర్చోవడం లేదా నిలుచోవడం కారణంగా నడుము నొప్పి సమస్య వెంటాడుతుంది. నడుము నొప్పితో పాటు ఒక్కోసారి ఎముకల్లో కూడా నొప్పి వస్తుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం..
ప్రస్తుత ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, పని విధానం కారణంగా చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ బి12 లోపించడం కూడా నడుము నొప్పికి ప్రధాన కారణంగా ఉంది. విటమిన్ బి12 తో శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే..నడుము సహా బాడీ మొత్తం నొప్పిగా ఉంటుంది. నడుము నొప్పిని దూరం చేసే కొన్ని సులభమైన చిట్కాలు పరిశీలిద్దాం..
నడుము నొప్పి దూరం చేసే చిట్కాలు
వేడి నీళ్లతో స్నానం
నడుము నొప్పి సమస్య బాధిస్తుంటే..వేడి నీళ్లతో కాపడం చేయడం లేదా స్నానం చేయడం ద్వారా చాలావరకూ ఉపశమనం పొందవచ్చు. బాత్ టబ్‌లో వేడినీళ్లు పోసి కాస్సేపు అందులో కూర్చుండిపోవాలి. ఇంట్లో బాత్‌టబ్ లేకపోతే వేడినీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అయితే నీళ్లు ఎక్కువ వేడిగా లేకుండా చూసుకోవాలి.
పసుపు పాలు
మజిల్ పెయిన్స్, ఎముకల్లో పెయిన్స్ దూరం చేసేందుకు పసుపు పాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందుకు దోహదపడతాయి. పసుపుపాలు తాగడం వల్ల ఎముకల్లో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నడుము కింది భాగంలో నొప్పిగా ఉంటే..రాత్రి నిద్రించేముందు...పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి.
ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు తమ పోశ్చర్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. ఎక్కువగా వంగి లేదా ఎక్కువగా వాలి పనిచేయకూడదు. ప్రతి అరగంటకోసారి లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. మద్యమధ్యలో రెండు చేతులు లేపి ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి. దీనివల్ల శరీరంలోని ఎముకలు పట్టేయకుండా ఉంటాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా మార్చి మార్చి పడుకోవాలి.
నడుము నొప్పి దూరం చేసేందుకు హెర్బల్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. హెర్బల్ టీ కారణంగా నొప్పులు చాలావరకూ తగ్గుతాయి. హెర్బల్ టీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. గ్రీన్ టీలో అల్లం చిన్న చిన్న ముక్కలుగా వేసి టీ కాయాలి. ఈ టీ తాగడం వల్ల నడుము నొప్పి సమస్య పోతుంది.
విటమిన్ బి12 లోపం
శరీరానికి బలం చేకూర్చేందుకు తగిన మోతాదులో విటమిన్ బి12 తప్పకుండా ఉండాలి. దీనికోసం నిర్ణీత పద్ధతిలో అరటిపండ్లు, పాలు, పెరుగు, ఎగ్స్, పన్నీరు, స్ట్రాబెర్రీస్, టూనా ఫిష్, విటమిన్ 12 ఉండే ఇతర పదార్ధాలు తీసుకోవాలి. దీనివల్ల నడుము నొప్పి చాలావరకూ తగ్గిపోతుంది.
Also read: Tulsi Leaves: ఆరోగ్యానికి అమృతమే..రోజూ పరగడుపున తీసుకుంటే ఏ వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook