ఆవ నూనెతో ఆరోగ్యం పదిలం..నేటికీ ఇంట్లో మూడు పూటలా తయారు చేసుకునె ఆహారంలో Mustard oil (ఆవాల నూనె)ను ఉపయోగించడం వల్ల వేరే నూనెతో వాడే వారికంటే ఆరోగ్యవంతులుగా  ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. చాలారకాల వ్యాధుల నుంచి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చని డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులే (Dieticians and Health Experts) చెబుతున్నారు. నిపుణులు  చెప్పిన విషయాలు తెలుసుకోండి.  అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆవాల నునెతో కలిగే ప్రయోజనాలు (Benefits Of Mustard Oil)
బ్యాక్టీరియాల అంతు చూస్తుంది...

ఆవనూనెతో తయారైన ఆహారం తింటే మన గొంతు, శ్వాసకోశ వ్యవస్థ బలంగా ఉంటుంది. మన శరీరంలోకి ఏ రకమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు చేరుకున్నా.. ఆవనూనెతో చేసిన వంటలు తింటే అవి చనిపోతాయి. ఒకవేళ చనిపోకపోయినా అవి వేగంగా వృద్ధి చెందకుండా చేస్తుంది. ఎందుకంటే ఆవనూనెలో యాంటీ ఫంగల్ (Antifungal), యాంటీ బాక్టీరియల్ (Antibacterial), యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.


ఈ జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ..
ఆవనూనెతో చేసిన వంటకాలు తినేవారికి ఇతర వారితో పోలిస్తే కఫం, జలుబు, ఛాతీనొప్పి, గొంతునొప్పి, దగ్గు వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ.


గుండెకు కూడా మేలే...
సింథటిక్, రిఫైండ్ నూనెలతో తయారైన ఆహారాన్ని తినడం వల్ల అవి నేరుగా శరీరంలోకి వెళ్లి సిరల్లో అదనపు కోవ్వు రూపంలో పేరుకుపోయి.. ధమని పనులను అడ్డుకుంటాయి. అదే ఆవనూనె లేక ఆవాల నూనె అయితే అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుంది. కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!


జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగు..
ఆవనూనె పూర్తిగా సహజసిద్ధమైనది. దీనిని మన శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా ఇది గట్ బ్యాక్టీరియాకు మేలు చేయడమే కాకుండా..  జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.


మలబద్ధకం దూరం.. 
ఇతర నూనెలతో తయారైన ఆహారంతో పోలిస్తే ఈ నూనెతో తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఈ ఆహారాన్ని తీసుకునే వ్యక్తులకు ఫ్రీ మోషన్ అవుతుంది. తరచూ మలబద్ధకం, కడుపునొప్పితో బాధపడుతున్న వారు ఈ నూనెను ఆహారంలో ఉపయోగిస్తే ఆ సమస్యలు దూరమవుతాయి.


బరువును అదుపులో ఉంచుతుంది...
ఆవనూనెతో తయారైన ఆహారం క్రమం తప్పకుండా తినడం వల్ల అది మన శరీరంలోని కొవ్వును  కరిగించి శరీర బరువును నియంత్రిస్తుంది.  ఇతర నూనెల ఉపయోగంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దాంతో మధుమేహం, ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనివల్ల ఆ సమస్యలు దరిచేరకుండా చేసుకోవచ్చు. తియ్యని తేనె.. ఎన్నో ప్రయోజనాలు..


డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది..
ఆవనూనె బ్యాక్టీరియాలను చంపడమే కాకుండా మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇది ఎల్లప్పుడూ మన శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.చర్మాన్ని మృదువుగా, సౌందర్యవంతంగా...
ఈ ఆవనూనెలో విటమిన్-ఈ(Vitamin-E) అధికంగా ఉంటుంది. దీంతో తయారైన ఆహారం తినడం వల్ల మన చర్మం మృదువుగా, సౌందర్యవంతంగా తయారవుతుంది.  


మన చర్మం ఎప్పుడూ పొడిబారకుండా తేమతో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ నూనెను ఉపయోగించుకుంటూ మీరు ఇంటినే బ్యూటీ పార్లర్‌గా మార్చుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఆవాల నూనెను  మీరు ఏ సీజన్‌లో అయినా నిశ్చింతగా వంటలలో ఉపయోగించుకోవచ్చు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ