Ground Nut Health Benefits: మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పల్లీలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తో పాటు ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీలలో ఫైబర్, విటమిన్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పల్లీలు ఎన్నో రకాలుగా మనకు లభిస్తుంటాయి. అందులో ముఖ్యంగా వేయించిన పల్లీలు ,ఉడికించిన పల్లీలు, నానబెట్టిన పల్లీలు తరచూ మార్కెట్‌లో చూస్తుంటాము. వీటిని మనం స్నాక్స్ రూపంలో లేకపోతే పులిహోరలో లేకపోతే కూర పొడిలల్లో  ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం.


పల్లీలు చూడడానికి చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజు తినడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే మోనోసాక్యురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు వేయించిన పల్లీలు తినడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతే పల్లీలను తినడం వల్ల అతిగా తినే కోరికను కూడా నియంత్రించుకోవచ్చు. సహజంగా బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు.


పల్లీలు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేసే ముందు కానీ తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తినడం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయి.  పల్లీలల్లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని వల్ల మెదడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు పల్లీలను తినడం వల్ల మెదడును చురుగ్గా ఉంటుంది. 


కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా  పల్లీలు తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జలుబ్బు, దగ్గు వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము.


అయితే పల్లీలు ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు కానీ వీటిని అతిగా తీసుకోవడం మంచిది కాదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు దక్కుతాయి. వీటితో పాటు ఆరోగ్యకరమైన పండ్లు, 
కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Immunity System: రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని తేలిపే 7 సంకేతాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter