Cancer medicine: క్యాన్సర్ ఓ మహమ్మారి. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా క్యాన్సర్‌కు మందు మాత్రం కనిపెట్టలేని పరిస్థితి. అందుకే మీకొక గుడ్ న్యూస్. ఇవి క్రమం తప్పక తింటే..క్యాన్సర్‌కు సైతం చెక్ పెట్టవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో మనం తినే బార్లీ ( Barley ), గోధుమలు ( Wheats ), ఓట్స్ ( Oats ) లాంటిదే క్వినోవా ( Quinoa ) అనే దినుసులు. పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే క్వినోవా పంటను యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. క్వినోవా ప్రాధాన్యతను గుర్తించింది కాబట్టే ఐక్యరాజ్యసమితి ( UNO ) రెండేళ్ల క్రితమే క్వినోవా ఇయర్‌గా ప్రకటించింది. క్రమం తప్పకుండా క్వినోవా తింటే..చాలా రకాల వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని కూడా దూరం చేయవచ్చు. 


గోధుమ రంగు, ముదురు గోధుమ, నలుపు, గులాబీ రంగుల్లో క్వినోవా లభ్యమవుతుంది. గోధుమలతో పోలిస్తే క్వినోవాలోనే ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. గ్లూటెన్ ఉండకపోవడం వల్ల సహజంగా పిండి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే ఎదురయ్యే ఒబెసిటీ, డయాబెటిస్ ( Diabetes ), గుండె సంబంధ సమస్యలు క్వినోవాతో ఎదురు కావు. క్వినోవాలో ఫైబర్ కంటెంట్ ( Fiber Content ) ఎక్కువగా ఉన్నందున జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలు తక్కువగా ఉన్న కారణంగా బరువు తగ్గించుకోడానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున జీవక్రియ బాగుంటుంది. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా క్వినోవా ధాన్యాన్ని వినియోగించవచ్చు.


Also read: Health Benefits Of Neem: వేప తింటే షుగర్ కంట్రోల్, ఎన్నో ప్రయోజనాలు


అన్నంలా..కిచిడీలా, పొంగలి, బిర్యానీ, సలాడ్, కుకీ, బ్రెడ్, బిస్కట్ ఇలా విభిన్నరకాలుగా వండుకోవచ్చు. కేవలం 3-4 గంటల్లోనే క్వినోవా మొలకలు వస్తాయి. రక్తంలో నుంచి కొలెస్ట్రాల్‌ను తగ్గించే కాలేయాన్ని యాక్టివ్ చేస్తుంది. క్వినోవా ( Quinoa )లో ఫ్యాటీ యాసిడ్స్ , ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. క్వినోవాలో విటమిన్ బి, బి3, బి12 ( Vitamin B , B3, B12 rich in Quinoa ) లు పుష్కలంగానే ఉంటాయి. చర్మంలో డార్క్ మెలనిన్‌ను తగ్గించి..వయస్సుతో పాటు వచ్చే చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. 


అన్నింటికంటే ముఖ్యంగా క్వినోవాను తరచూ తింటే క్యాన్సర్ ( Cancer )దూరం చేయవచ్చని తెలిసింది. క్వినోవా తినేవారిలో క్యాన్సర్ కారకాలు దరి చేరవని వివిధ పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్‌తో బాధపడేవారు నిత్యం క్వినోవా తినడం మంచిది. 


Also read: Nasal Sprays for COVID-19: స్ప్రే వాడితే జలుబుతో పాటు కరోనా వైరస్‌‌కు చెక్ పెట్టవచ్చా?