Ber For Weight Loss In 8 Days: సీజన్‌ మారినప్పుడల్లా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి సీజన్‌లో పండ్లు, ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో లభించే పోషకాలు అనారోగ్య సమస్యల నంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా మారుతుంది. అయితే ప్రస్తుంత భారత్‌లో  శీతాకాలం నడుస్తోంది. దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా మార్కెట్‌లో లభించే పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో  రేగు పండ్లను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేగు పండును బెర్‌ ఫ్రైట్‌ అని కూడా పిలుస్తుతారు. ఇది రకరకాల రంగుల్లో కనిపిస్తుంది. రేగి పండ్లలో ఎండి రేగి పండు, డార్క్‌ రెడ్‌ , పచ్చి రేగు  పండ్లు ఇలా వివిధ రకాలుగా మార్కట్‌లో కనిపిస్తాయి. వీటిలో చక్కటి అరోగ్య విలువలు దాగి వున్నాయి. దీంతో మన శరీరంలో వచ్చే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతాయి.


రేగు పండులో  ప్రొటీన్‌, పీచు, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి.  ఈ పండు తినటం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మలబద్ధకం సమస్యలు:
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రేగు పండును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


బరువుపెరగడం :
ఆయిల్‌ ఫుడ్ విచ్చల విడిగా తింటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరిగి బరువు కూడా పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తింటే చాలా మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


స్కిన్ ట్యాగ్స్:
రేగి పండుతోనే కాకుండా రేగు ఆకులు కూడా ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు స్కిన్ ట్యాగ్స్‌ సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరిపించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


Also Read:  jamuna death : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత


Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి