Best Dry Fruits: డ్రై ఫ్రూట్స్ శరీరంలో పోషక విలువలను పెంచడానికి కృషి చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉదయం పూట వినియోగిస్తే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో..కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది. ఆ డ్రై ఫ్రూట్స్ ఎంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొలెస్ట్రాల్ తగ్గించే డ్రై ఫ్రూట్స్:


జీడిపప్పు వల్ల కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటుంది  (Cashew) :


జీడిపప్పు క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.


వాల్నట్(Walnut):


వాల్‌నట్‌లను బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో పోషకాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో వాల్‌నట్‌లను తీంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.


పిస్తా(pistachio):



పిస్తా అన్ని డ్రై ఫ్రూట్స్‌లో కంటే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.  ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కావున శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.


అవిసె గింజలు (flax seeds) :


అవిసె గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి దోహదపడతాయి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Grow Coriander Leaf At Home: కొత్తిమీరను పెంచడానికి వివిధ మార్గాలు..ఇంటి ఏరియాలో ఇలా సులభంగా పెంచండి..!!


Also Read: Sperm Count: స్పెర్మ్ కౌంట్‌ తరుచుగా తగ్గుతుందా..అయితే ఈ ఆహారాన్ని అస్సలు తీసుకోకండి.!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook