Sperm Count: స్త్రీల మాదిరిగానే పురుషులలో కూడా పునరుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే పునరుత్పత్తి బలంగా ఉండి, సంవృద్ధిగా పని చేస్తుంది. ఈ వ్యవస్థ బలంగా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది స్పెర్మ్ కౌంట్ కోసం నిత్యం వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు. అటువంటి పరిస్థితిలో శరీరంలో అనేక లోపాలు ఏర్పడి స్పెర్మ్ కౌంట్ తగ్గి పోతుంది. దీని వల్ల తండ్రి కావాలని కోరిక అర్ధంతరంగా ఆగిపోతుంది. అందుకే క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
పురుషులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి:
మద్యం(Alcohol):
తండ్రి కావాలనుకుంటే..ముందుగా కొంత కాలం మద్యానికి దూరం ఉండడం మంచింది. మద్యానికి బానిస అయితే వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతే కాదు, తండ్రి కావాలనే కల కూడా చెదిరిపోవచ్చు. మద్యపానం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గి స్పెర్మ్ కౌంట్ తగ్గడం మొదలవుతుంది. దీని కారణంగా పిల్లలు పుట్టడం కష్టమవుతుంది.
ప్రాసెస్ చేసిన మాంసం(Processed Meat):
ప్రాసెస్ చేసిన మాంసమైన బేకన్, హామ్, హాట్ డాగ్‌ల వంటి వాటిని తినడం మంచిది కాదు. ఇవి గుండె సమస్యలను తెచ్చిపెట్టడమే కాకుండా..స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తాయి.
కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు (Full-fat milk and dairy products):
పాల ఉత్పత్తులను ఇష్టపడే వారు సంతానం కోసం..అలవాట్లను మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొవ్వు పాలలో ఈస్ట్రోజెన్‌ను కలిగి ఉంటుంది.ఇవి స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Gayatri Jayanti 2022: గాయత్రి జయంతి తేదీ.. ప్రాముఖ్యత.. ఆరోజు పఠించాల్సిన గాయత్రి హారతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook