Grow Coriander Leaf At Home: భారతీయ వంటకాల్లో రుచిని పెంచేందుకు మసాలా దినుసులు ఎంతగా తోడ్పడుతాయి. ముఖ్యంగా పచ్చి కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి మంచి పోషక విలువలను అందిస్తుంది. ఇవి తాజాగా ఉన్నప్పుడు వంటకాల్లో వాడితే ఆహారం గుమగుమలాడుతుంది. అయితే చాలా మంది ఇళ్లలో కొత్తిమీర ఆకులు అందుబాటులో ఉండవు. ఈ ఆకులను ఇంట్లో పెంచుకోవడానికి విభిన్న మార్గాలున్నాయి అవేంటో తెలుసుకుందాం..
విత్తనాలతో పెరుగుతుంది:
కొత్తిమీరను పెంచడానికి చాలా సులభమైన మార్గం విత్తనాల ద్వారా పెంచడం. కిచెన్ గార్డెన్ ఏరియాలో విత్తనాలను నాటండి. క్రమం తప్పకుండా వీటికి నీరును పోయాలి. ఈ విత్తనాలు మొలకెత్తడం మొదలవుతాయి. అంతేకాకుండా వీటిని మీ ఇంట్లో ఉండే పాత డబ్బాలు, టబ్‌లు లేదా కుండలలో కూడా విత్తనాలు వేసి పెంచవచ్చు. వీటిలో తేమ కోసం ఎప్పటికప్పుడు నీరును పోయాలి. ఆ తర్వాత ఈ మొక్కలు పెరగడం మొదలవుతుంది.
రూట్ నుంచి కూడా కొత్తిమీర పెరుగుతుంది:
కొత్తిమీర ఆకులను ఉపయోగించిన తర్వాత..చాలా మంది వాటి రూట్‌లను వ్యర్థంగా పారివేస్తారు. కొత్తిమీర రూట్‌ని మొత్తని మట్టిలో నాటితే వాటికి దట్టంగా ఆకులు పెరుగుతాయి.
పెరిగిన ఆకుల కోత:
కొత్తిమీర ఆకులు పెరగడానికి వాటికి పెరిన ఆకులను తెంపి వాడుకోవాలి. మొక్కలను తీసి వేయకుండా కేవలం ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా వీటిని తీసుకున్న తర్వాత మట్టిలో బలం కోసం కంపోస్ట్ వేసి మొక్క ముందు భాగంలో ఉంచాలి. అవసరాన్ని బట్టి ఈ కోసిన మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు పెట్టాలి.
Also Read: Sperm Count: స్పెర్మ్ కౌంట్ తరుచుగా తగ్గుతుందా..అయితే ఈ ఆహారాన్ని అస్సలు తీసుకోకండి.!!
Also Read: Black Raisins: మీ డైలీ డైట్‌లో అవి చేర్చుకుంటే..వృద్ధాప్య ఛాయలు దరిదాపులకు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook