Dandruff: శీతాకాలంలో ఎక్కువగా వేధించే సమస్య తలలో చుండ్రు పేరుకుపోవడం. చుండ్రు పోయేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. మరేం చేయాలి. ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు సమస్య నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ చుండ్రు సమస్య సాధారణంగా మారింది.  ముఖ్యంగా శీతాకాలం వచ్చింంటే చాలు ఇదొక సమస్యగా మారిపోతుంది. ఏం షాంపూ వాడినా డాండ్రఫ్ మాత్రం తగ్గడం లేదని చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. చివరకు డాక్టర్ వద్దకు వెళ్లినా ప్రయోజనం లేదని వాపోతారు. మరి ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా?


వంటింట్లో ఉండే పదార్థాలతోనే చుండ్రును వదిలించుకోవచ్చు. (Best Tips to remove dandruff)పెద్ద పెద్ద పేరు మోసిన షాపులు అవసరం లేదు. మందులు కూడా వేసుకోనవసరం లేదు. సులభమైన చిట్కాలతో చుండ్రుని వదిలించుకోవచ్చు. కొబ్బరి నూనెతో సమానంగా నిమ్మరసం తీసుకోండి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు తలకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య (Dandruff Problem) తగ్గిపోతుంది. కానీ రాత్రంతా తలకు పట్టించి ఉంచకూడదు.


మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ మెంతులను పేస్ట్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు పోతుంది. తలను నీటితో తడుపుకొని.. ఆ తర్వాత సన్నటి ఉప్పుతో తలంతా మర్ధన చేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రు వదులుతుంది. ఉల్లిరసం, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపిన మిశ్రమాన్ని తలపై రాసుకోవాలి. కుదుళ్లకు పట్టేలా మర్దన చేసుకోవాలి. కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు చాలా వరకు తగ్గుతుంది.


Also read: Natural Herbs: జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ ఆరు వనమూలికలతో చెక్ పెట్టండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి