Protein Rich Veg Foods: మాంసాహారం కంటే ఎక్కువగా ప్రోటీన్లు లభించే శాకాహార పదార్ధాలు ఇవే
Protein Rich Veg Foods: శాకాహారుల కంటే మాంసాహారులు బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. కారణం ప్రోటీన్లు మాంసాహారంలో అధికంగా ఉండటమే. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాల్లో మాంసాహారం కంటే ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి.
Protein Rich Vegetarian Foods to Alternate Non Veg: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు ప్రోటీన్లు చాలా అవసరం. మనిషిని బలంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దేవి ప్రోటీన్లే. అందుకే వైద్యులు తరచూ ప్రోటీన్ ఫుడ్స్ తినమనే సలహా ఇస్తుంటారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఏయే ఆహార పదార్ధాల్లో మాంసాహారాన్ని మించి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్లు మనిషికి ఎంత అవసరమనేది ఆఫ్రికా దేశాల్లోని పిల్లల్ని చూస్తే తెలుసుకోవచ్చు. వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే సరైన పౌష్ఠికాహారం లేకపోవడం వల్ల అక్కడి పిల్లలు బక్కపల్చగా, శరీరంలోని అంగాలు అంటే స్కెలెటన్ కన్పిస్తూ అత్యంత బలహీనంగా ఉంటారు. సరైన ప్రోటీన్లు లేకపోవడమే దీనికి కారణం. అందుకే మనిషి శరీర నిర్మాణం, వికాసం, ఎదుగుదలకు ప్రోటీన్లు చాలా అవసరం. అందుకు అవసరమైన పౌష్ఠికాహారం తప్పకుండా తీసుకోవాలి.
సాధారణంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనగానే మాంసాహారం గుర్తొస్తుంది. మాంసాహారంలో నిజంగానే ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. అయితే కొన్ని రకాల శాకాహార పదార్ధాల్లో కూడా మాంసాహారాన్ని మించిన ప్రోటీన్లు లభ్యమౌతాయి. ఇవి మన శరీరాన్ని పటిష్టంగా మారుస్తాయి. ప్రోటీన్ల కోసం ఎలాంటి శాకాహార పదార్ధాలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
Also Read: Thyroid Problem: థైరాయిడ్‌తో బాధపడుతున్నారా, లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు తప్పనిసరి
సోయా బీన్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఎంతగా ఉంటే ప్రతి వంద గ్రాముల సోయా బీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అంటే మనిషికి రోజుకు అవసరమైన ప్రోటీన్లలో 72 శాతం సోయా బీన్స్‌తో కవర్ చేయవచ్చు.
పన్నీర్ చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇది కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రతి వంద గ్రాముల పన్నీర్‌లో 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్‌ను వివిధ రకాల కాంబినేషన్ ఫుడ్స్‌గా వండుతుంటారు. బెస్ట్ వెజిటేరియన్ ఫుడ్‌గా చెప్పవచ్చు.
ఇక అన్నింటికంటే మించినవి పప్పులు. ఓ కప్పు కందిపప్పు తీసుకుంటే అందులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు శెనగలు తీసుకుంటే అందులే 39 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అదేవిధంగా మసూర్ దాల్, పెసర పప్పు, మినపపప్పుల్లో కావల్సిన పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. మినప, పెసర పప్పుల్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ.
ఇక బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా, అంజీరా, చియా సీడ్స్ వంటివాటిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే మాంసాహారం అవసరమే ఉండదు.
Also Read: Best Veg Foods: ఈ కూరగాయల్ని రాత్రి పూట మార్చి మార్చి తింటే, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ అన్నీ మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి