Thyroid Problem: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి, వివిద రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. మీ జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఆధునిక బిజీ జీవనవిధానంలో ఎదురయ్యే కొన్ని వ్యాధులు డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, థైరాయిడ్, హార్ట్ ఎటాక్ వంటివి. అన్నింటికీ మించి అధిక బరువు లేదా స్థూలకాయం సమస్య. ఈ అన్ని సమస్యలు ఒకదానికొకటి సంబంధమున్నవే. స్థూలకాయం కారణంగా థైరాయిడ్ సమస్య తలెత్తుతుంది. అదే సమయంలో థైరాయిడ్ కారణంగా స్థూలకాయం రావచ్చు. ఇదే థైరాయిడ్ మధుమేహానికి కారణమౌతుంది. ఇలా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో ప్రధానంగా కన్పిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ అత్యంత ప్రధానమైంది. ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగానే కన్పిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ముందుగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఓ గ్రంథి. హార్మోన్లు ఉత్పత్తిలో సమతుల్యతతో కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైందంటే థైరాయిడ్ సమస్య ఉందని అర్ధం. థైరాయిడ్ సమస్య ఉంటే శరీరం బరువు పెరిగిపోతుంటుంది. థైరాయిడ్ సమస్య నిర్మూలించాలంటే లైఫ్ స్టైల్ లో మార్పులు అవసరం. ఎలాంటి మార్పులు చేయాలో పరిశీలిద్దాం..
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు అన్ని రకాల కూరగాయలు తీసుకోకూడదు. ముఖ్యంగా కొన్ని కూరగాయల్ని డైట్ నుంచి దూరం చేయాలి. వీటిలో క్యాబేజి, బ్రోకలి, కాలిఫ్లవర్ వంటివి ముఖ్యమైనవి. ఈ కూరగాయలు శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం సోయాబీన్, గుడ్లు, వాల్నట్స్, చేపలు తినాల్సి ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య చాలా త్వరగా కొలిక్కి వస్తుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. అందుకే ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళ తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేస్తుండాలి.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్ అనేది శరీరానికి ప్రమాదకరం. ఎందుకంటే కెఫీన్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. కెఫీన్ ఉత్పత్తుల్ని సాధ్యమైనంతవరకూ మానేయాల్సి ఉంటుంది.
Also read: Weight Loss Tips: బరువు నియంత్రణలో కీలక విషయాలు, చేయకూడని తప్పులివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook