Diabetes Patients: కాకరకాయ జ్యూస్‌తో మధుమేహం, ఊబకాయం సమస్యలన్ని 7 రోజుల్లో చెక్ పెట్టొచ్చా..?
Bitter Gourd Juice For Diabetes Patients: కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Bitter Gourd Juice For Diabetes Patients: కాకరకాయ పేరు చెప్పగానే చాలామంది విసుక్కుంటారు. చేదుగా ఉండడం వల్ల వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరానికి కాపర్, విటమిన్ బి, ఆమ్లాలు, అసంతృప్తి కొవ్వులు లభిస్తాయి. ముఖ్యంగా కాకరకాయలను చలికాలంలో ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బయోటెక్ గుణాలు అంటువ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చలికాలంలో ఎక్కువగా ఆహారంలో కాకరకాయలు వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాకరకాయ ప్రయోజనాలు:
1. వాతావరణంలో మార్పుల కారణంగా శరీరంలో కూడా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి వాతావరణంలో తేమ కారణంగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్ లో వీరు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవడానికి కాకరతో తయారుచేసిన రసాన్ని తీసుకోవాలి. ఇలా చలికాలంలో క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని ఐరన్ లోపం కూడా దూరమవుతుంది.
2. వివిధ ఆహార పలవాట్ల వల్ల చాలామందిలో చెడు కొలస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. దీని కారణంగా ఊబకాయం జీర్ణక్రియ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకొందరిలో కాలేయం కూడా దెబ్బతింటోంది. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి కాకర రసం సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి పై వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అంటూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడుతుంది.
3. చలికాలంలో వాతావరణంలో తేమ పరిమాణాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చర్మం పొడిబారడం ఇతర అంటూ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు పాటించిన వాటి భారీనా పడక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూనే ఇంటి చిట్కాల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది. అంటువ్యాధులు, చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కాకర రసం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.
Also Read: Pak Vs NZ: డారిల్ మిచెల్ మెరుపులు.. పాక్ టార్గెట్ ఎంతంటే..?
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook