New Zealand Vs Pakistan Live Updates: టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు పాక్‌కు 153 పరుగుల లక్ష్యం విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ (46) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో డారిల్ మిచెల్ (53) మెరుపులు మెరిపించాడు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, నవాజ్ ఒక వికెట్ తీశారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్‌వే ఓపెనింగ్‌కు దిగారు. షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతికి అలెన్ ఫోర్ కొట్టాడు. అయితే మూడో బంతికే అలెన్ ఎల్బీడబ్ల్యూని అవుట్ చేసి కివీస్‌కు షాక్ ఇచ్చాడు అఫ్రిది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసిన కాన్వేను షాదాబ్ ఖాన్ అద్భుతంగా రనౌట్ చేశాడు.
ఆ తరువాత గ్లెన్ ఫిలిప్స్ కూడా 6 పరుగులకే ఔట్ అయ్యాడు. విలియమ్సన్, డారిల్ మిచెల్ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 8.2 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది. కివీస్ ఇన్నింగ్స్ కుదురుకుంటున్న సమయంలో మరోసారి అఫ్రిది దెబ్బ తీశాడు. 42 బంతుల్లో 46 పరుగులు చేసిన విలియ్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. 17 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ చెలరేగి ఆడాడు. 35 బంతుల్లోనే 53 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు సాధించింది. 153 రన్స్ చేస్తే పాకిస్థాన్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది.
Also Read: Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్
Also Read: IND vs ENG Dream11 Team: భారత్ vs ఇంగ్లండ్ డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook