Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్

Shaheen Afridi And Shadab Khan Prank With Haris Rauf: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ బర్త్ డే వేడుకలను సహచర ఆటగాళ్లు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా  షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చేసిన ఓ అల్లరి పని నవ్వు తెప్పిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 02:58 PM IST
Haris Rauf: హరీస్ రవూఫ్ బర్త్ డే.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ ఏ చేశారో చూడండి.. వీడియో వైరల్

Shaheen Afridi And Shadab Khan Prank With Haris Rauf: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ సోమవారం తన 29వ పుట్టినరోజు జరుపుకున్నాడు. హరీస్ బర్త్ డే సందర్భంగా సహచర ఆటగాళ్లు కేక్ కట్ చేయించి.. వేడుకలు నిర్వహించారు. అయితే అంతకుముందు అతని ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చేసిన అల్లరి పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. కేక్ కట్ చేయడానికి హరీస్ రవూఫ్ ముందుకు రాగా.. షాహీన్, షాదాబ్ అతనికి అడ్డుగా నిలబడ్డారు. వారు హరీస్‌ను వెనుకకు నెట్టేసి.. ఇద్దరు కేక్ కట్ చేసేందకు పోటీ పడుతున్నట్లు యాక్ట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పీసీబీ షేర్ చేసింది.

కేక్ వచ్చిన తర్వాత.. షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ కత్తితో కేక్ కట్ చేయడానికి ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. వారి ఇద్దరు కేక్ చేయడానికి రాగా.. మిగిలిన ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్‌ చేశారు. వెనుక నుంచి హరీస్ వచ్చి.. ఇది తన పుట్టిన రోజు అని చెప్పాడు. షాహీన్, షాదాబ్ ఇద్దరూ హరీస్ వైపు చూడగా.. అక్కడ నిలబడి ఉన్న మరో ఆటగాడు అవును.. ఇది అతని పుట్టినరోజు అని చెప్పాడు. తరువాత ఇద్దరు ఆటగాళ్లు కత్తిని హరీస్‌కి ఇచ్చి కేక్ కట్ చేయించారు. అనంతరం అందరూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News