COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Black Carrots For Weight Loss: చలికాలం రాగానే మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఎరుపు రంగు క్యారెట్లు దర్శనమిస్తాయి. చాలామంది వీటిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. భారతీయులు ఎక్కువగా వీటిని సలాడ్స్ తో పాటు డెజర్ట్‌ల వరకు ప్రతి వంటకంలో వీటిని వినియోగిస్తారు. అయితే సాధారణంగా మార్కెట్లో మనం ఎరుపు రంగు, నారింజరంగుతో కూడిన క్యారెట్లనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మేము మీరు ఎప్పుడూ చూడని నలుపు రంగు క్యారెట్ ని పరిచయం చేయబోతున్న. ఈ క్యారెట్లు శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. బ్లాక్ క్యారెట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు తినడం వల్ల అల్జీమర్స్ వ్యాధి నుంచి ఊబకాయం సమస్యల వరకు ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ నల్ల క్యారెట్ లను తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 



బ్లాక్ క్యారెట్ల ను తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
మధుమేహం నియంత్రణలో ఉంటుంది:

బ్లాక్ క్యారెట్లను ప్రతిరోజు తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది అంతేకాకుండా బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్యారెట్స్ లో యాంటీ-డయాబెటిక్ ఫినాలిక్ సమ్మేళనాలు, రక్తంలో చక్కెరను నియంత్రించే శక్తి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి చలికాలంలో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలని వారు తప్పకుండా వీటిని జ్యూస్ లా తయారు చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. 


బరువు తగ్గడం:
బ్లాక్ క్యారెట్లను రెగ్యులర్ గా తినడం వల్ల శరీర పరువు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఒబేసిటీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీర బరువును సులభంగా నియంత్రిస్తారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ క్యారెట్స్ లో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 


రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది:
బ్లాక్ క్యారెట్స్ లో ఉండే పోషకాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా శరీరాన్ని కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే తెల్ల రక్త కణాల సంఖ్య పెంచేందుకు కూడా ఈ బ్లాక్ క్యారెట్స్ కీలకపాత్ర పోషిస్తాయి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


అల్జీమర్స్‌:
బ్లాక్ క్యారెట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి వంటి అనేక పోషకాలు లభిస్తాయి కాబట్టి రెగ్యులర్గా వీటిని తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్యమైన గుండె కోసం:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఉండే సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బ్లాక్ క్యారెట్లను తీసుకోవడం వల్ల గుండె దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ సులభంగా దూరమవుతాయి. కాబట్టి శీతాకాలంలో హార్ట్ పేషెంట్స్ తప్పకుండా బ్లాక్ క్యారెట్స్ ని తీసుకోవాలి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి