చిన్నారుల్లో బ్రెయిన్ ట్రూమర్
ఎయిమ్స్ లెక్కల ప్రకారం ప్రతి ఏటా సగటున 40 వేల నుంచి 50 వేల మంది బ్రెయిన్ ట్రూమర్ బారిన పడుతున్నారు. వాటిలో 20 శాతం పిల్లలే ఉంటున్నారు. వాటిలో 20 శాతం పిల్లలే ఉంటున్నారు. ఆందోళన కల్గించే విషయం ఏటంటే..గత ఏడాది రికార్డుల ప్రకారం ఈ వ్యాధిన బారిన పడిన వారిలో పిల్లల సంఖ్య 25 శాతానికి చేరింది. ప్రతి ఏటా 2 వేల 500 మంది చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని బట్టి ఈ వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో మన అర్ధం చేసుకోచ్చు...
90 శాతం చికిత్సతో నయం...
సహజంగా బ్రెయిన్ ట్రూమర్ అనగానే మనలో చాలా మంది తెగ కంగారు పడిపోతుంటారు. మానవ శరీరంలోని అత్యంత సున్నిత ప్రాంతమైన మెదడులో కణితులు ఏర్పడితే అక్కడ చికిత్స ఎలా సాధ్యమని మనలో భయాలకు ఒక ప్రధాన కారణం. ఒకప్పటి పాత వైద్య పద్దతులతో కొంత వరకు ప్రాణనష్టం కలిగిన మాట వాస్తవమే.. కానీ ఆధునిక వైద్య విధానం సమర్థవంతంగా పనిచేస్తోంది. ప్రత్యేకించి రేడియేషన్ వైద్య విధానం అమల్లో వచ్చినప్పటి నుంచి ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోగల్గుతున్నాం. అందుకే బ్రెయిన్ ట్రూమర్ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వ్యాధి ముదిరే వరకు కాకుండా ప్రాధమిక స్థాయిలో గుర్తించి సకాలంలో చికిత్స నందించినట్లుయితే 90 శాతం వరకు జబ్బును నయం చేయవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
బ్రెయిన్ ట్రూమర్‌కు కారణాలు..
బ్రెయిన్ ట్రూమర్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే దాని గురించి ప్రాధమిక అవగాహన అవసరమంటున్నారు వైద్యులు. బ్రెయిన్ ట్రూమర్ కు గల కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం...
ఎయిమ్స్ డైరెక్టర్ అగర్వాల్ విశ్లేషణ ప్రకారం..బ్రెయిన్ ట్రూమర్ అనేది వయసుతో సంబంధం ఉండకపోవచ్చు కానీ చిన్న పిల్లల్లో ముఖ్యంగా మెదడు చుట్టూ ఉండే కపాలం అంత గట్టిగా ఉండకపోవడం వల్ల ఈ వ్యాధికి గురవడానికి అస్కారం ఉందంటున్నారు వైద్యులు. వెల్లడిస్తున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి సోకడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయని విశ్లేషించారు.
1) వాతావరణం సంబంధమైనవి : నిత్యం రేడియేషన్ కు గురయ్యే ప్రాంతాల్లోని వారికి మెదడులో గడ్డలు రావొచ్చు. వైద్య పరీక్ష కేంద్రాలు, పారిశ్రామికంగా రేడియేషన్ వెలువడేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోని వారికి, అణు ప్రమాదాలు జరిగిన చోట్ల ఈ తరహా ప్రమాదాలకు ఆస్కారం ఇస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
2) అయొనైజేషన్ లేకుండానే రేడియేషన్ : కొన్ని సందర్భాల్లో మనం అయొనైజేషన్ ఎక్కువగా లేకుండా కూడా రేడియేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఉదా...మొబైల్ వాడకం వల్ల ఇలా జరిగేందుకు ఛాన్స్ ఉంది. మొబైల్ ఫోన్స్ ఎక్కవగా వాడే సమయంలో గ్లయోమా తరహా మొదడులో గడ్డులు వచ్చే అవకాశం ఎక్కవగా ఉన్నట్లు ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అయితే మొబైల్ ఫోన్లు వాడే వారందరికీ ఈ వ్యాధి సోకుతుందని ఖచ్చితంగా చెప్పలేము కానీ.. అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. అందుకే 16 ఏళ్ల లోపు చిన్నారులకు మొబైల్ ఫోన్లు నిత్యం ఉపయోగించేందుకు ఇవ్వకపోవడమే మంచిందంటున్నారు వైద్యులు.
3) జన్యుపరమైన కారణం : మన శరీరంలో క్రోమోజోముల్లో వచ్చిన మార్పులతోనూ మొదడులో గడ్డులు రావొచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అయితే సాధారణంగా ఇందులోని కొన్ని క్రోమోజోముల్లో ఏమైన మార్పులు ఏర్పడటం వల్ల కూడా మొదడులో గడ్డులు వచ్చే ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు.
లక్షణాలు :
బ్రెయిన్ ట్రూమర్ లక్షణాలను ఎలా బ్రెయిన్ ట్రూమర్ లక్షణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ప్రైమరీ ట్యూమర్ల్లు, సెకండరీ బ్రెయిన్ ట్రూమర్లు. ఎక్కడ మొదలైన ట్యూమర్, అక్కడే తన లక్షణాలను కనబరిస్తే వాటిని ప్రైమరీ ట్యూమర్లు అంటారు. ట్రూమర్ గనుక ఏర్పడిన భాగం నుంచి ఇతర శరీర భాగాలకు పాకితే దాన్ని సెకండరీ ట్రూమర్లు అంటారు. కణితి ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి మెదడు కణజాలం దెబ్బతిన్న తీవ్రతను బట్టి సంబంధిత భాగాలు పనిచేయకుండా పోతాయి. కొన్ని సార్లు అస్తవ్యస్తమైన ప్రవర్తన మొదలు కావచ్చు. ట్యూమర్లు ఉన్న వారి లక్షణాలను ఒక్కసారి
పరిశీలిద్దాం..
* ఏ విషయంలోనూ ఒక నిర్ధారణకు రాలేకపోవడం
* జ్ఞాపక శక్తి, వస్తువులను లేదా మనుషులను గుర్తుపట్టలేని స్థితి ఏర్పడటం.
* ఏం చెయ్యాలో తెలియని స్థితి ఏర్పడటం.
* విషయాలను గ్రహించకలేకపోవడం.. అందుకు అనుగుణంగా ప్రవర్తించకపోవడం
* ఉన్నట్లుండి భావోద్వేగాలు విచిత్రంగా మారిపోవడం
* ఎదురుగా ఉన్నవి వాస్తవం కన్నా ఎత్తుగానో లేక దిగువకు కనిపించడం.
* తలనొప్పితో పాటు వాంతులు అవుడం.
* ఎక్కువగా నిద్రపోవడం రోజంతా మత్తుగా ఉండడం.
* హఠాత్తుగా దృష్టిలోపం ఏర్పడడం
పై లక్షణాలు ఏవి కనిపించినా అశ్రద్ధ వహించకుండా డాక్టర్లను సంప్రదించాలి.