Broccoli Fry Recipe: బ్రోకోలి ప్రస్తుతకాలంలో పరిచయం అవసరం లేని కూరగాయ. ఇది క్రూసిఫెరస్‌ కుటుంబానికి చెందినది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. దీని సలాడ్‌, బ్రోకోలి ఫ్రై తయారు చేసుకోవచ్చు. బ్రోకోలిలో విటమిన్‌ సి, కె, ఎ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా బ్రోకోలి యాంటీ ఆక్సిడెంట్లలకు ఇళ్ళు. ఇన్ని లాభాలు ఉన్న బ్రోకోలి ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలిగిస్తుంది. బ్రోకోలితో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రోకోలి ఆరోగ్యలాభాలు: 


బ్రోకోలిలో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు బ్రోకోలి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో ఉండే  విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. విటమిన్ కె ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బ్రోకోలిని వివిధ రకాలు ఉపయోగిస్తారు. అందులో బ్రోకోలి ఫ్రై ఒకటి. 


బ్రోకోలి ఫ్రై తయారీ విధానం 


బ్రోకోలి ఫ్రై ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం. ఇది తయారు చేయడానికి చాలా సులభం. ఇది  రోజువారి ఆహారంలో ఒక అద్భుతమైన చేర్పు.


కావలసిన పదార్థాలు:


బ్రోకోలి - 1 కిలో
ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా తరిగిన)
తోటకూర - కొద్దిగా (చిన్న ముక్కలుగా తరిగిన)
వెల్లుల్లి రెబ్బలు - 3-4
ఇంగువ - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
కారం పొడి - 1/2 టీస్పూన్
అల్లం పేస్ట్ - 1/2 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగిన)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 2-3 టేబుల్ స్పూన్లు



తయారీ విధానం:


బ్రోకోలిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, శుభ్రంగా కడిగి, నీరు పిండి వేయండి. వెల్లుల్లి రెబ్బలను నూరి పెట్టుకోండి. ఒక పాత్రలో నూనె వేడి చేసి, జీలకర్ర వేయండి. జీలకర్ర పచారం అయిన తర్వాత ఇంగువ వేసి వేగించండి. ఉల్లిపాయ, తోటకూర వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించండి. వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించండి.
బ్రోకోలి వేసి కలపండి. కారం పొడి, అల్లం పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపండి. కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మరగనివ్వండి. కొత్తిమీర వేసి కలపండి.


సర్వ్ చేయండి:


బ్రోకోలి ఫ్రైని వెచ్చగా సర్వ్ చేయండి.
ఇది రోటీ, చపాతి, అన్నం లేదా బిర్యానీతో బాగా సరిపోతుంది.
ఇష్టమైతే, దీనిలో క్యారెట్, బీన్స్ వంటి ఇతర కూరగాయలను కూడా చేర్చవచ్చు.

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook