Buttermilk Hidden Facts In Telugu: ప్రతి విందులో తప్పకుండా మజ్జిగ ఉంటుంది. ఎక్కువగా ఆహారాలు తీసుకున్నప్పుడు మజ్జిగను తీసుకోవడం వల్ల పొట్ట హాయిగా ఉంటుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారాలు తీసుకున్న తర్వాత మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను కూడా ఆరోగ్యంగా చేస్తాయి. అలాగే చర్మ సమస్యలను రాకుండా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ప్రతి రోజు మజ్జిగ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణక్రియ సమస్యలకు చెక్‌: 
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది: 
వేసవి కాలంలో మజ్జిగ తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీంతో పాటు బాడీలో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు సహాయపడుతుంది.


శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది: 
మజ్జిగలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌ చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సహాయపడతుంది. 


కండరాల నొప్పులను తగ్గించడం: 
వ్యాయామం చేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల కండరాల నొప్పులు కూడా సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా మజిల్‌ బిల్డింగ్‌ చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  


చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం: 
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేసి, మొటిమలు, ముఖంపై ఉండే మచ్చలను తొలగించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో పాటు స్కిన్‌ను బ్రైట్‌గా చేసేందుకు కూడా సహాయపడుతుంది. 


రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తి కూడా సులభంగా పెంచుతుంది. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.