Methi Aloo Paratha Recepie: ఆకుకూరలు ఎన్నో రకాలుగా మార్కెట్‌ల్లో దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనీరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి కావాలిసిన పోషకాలు దొరుకుతాయి. అయితే ఆకుకూరలో మెంతికూర కూడా ఒకటి. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కూరలు, పప్పుగా తినిని వారు ఈ మెంతి ఆకుతో పరాఠాలు తయారు చేసి తినవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేథీ ఆలూ ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు :


రెండు క‌ప్పుల-గోధుమ‌పిండి
ఒక క‌ప్పు-  మెంతిఆకు  
ఉప్పు 


స్ట‌ఫింగ్‌కి కావ‌ల్సిన ప‌దార్థాలు:


మూడు ఉడికించిన బంగాళాదుంప‌లు, పావు క‌ప్పు అటుకులు, పది  వెల్లుల్లి రెబ్బ‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, అర అంగుళం అల్లం, నాలుగు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ ధ‌నియాలు, ప‌సుపు, కారం, ఉప్పు త‌గినంత‌, వాము అర టీ స్పూన్, నిమ్మ‌ర‌సం రెండు టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్స్.


Also read: Winter Hydration Tips: చలికాలంలో డీహైడ్రేషన్ సమస్య నివారణకు ఏం చేయాలి, ఎందుకీ సమస్య వస్తుంది


మేథీ ఆలూ ప‌రాటా త‌యారీ:


ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకొని మెంతి ఆకులు, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. ఇందులోకి తగినంతా నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి.  త‌రువాత బంగాళాదుంప‌ల‌పై ఉండే పొట్టును తీసేసి మెత్త‌గా చేసుకోవాలి. దీనిని అటుకుల‌లో బంగాళాదుంప మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. ఇందులో వెల్లుల్లి , ఉల్లిపాయ ముక్క‌లు, అల్లం, ప‌చ్చిమిర్చి వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ధ‌నియాలు వేసి మిక్సీప‌ట్టుకుని ఆలూ మిశ్ర‌మంలో వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, వాము, నిమ్మ‌రసం, కొత్తిమీర వేసి బాగా క‌లుపుకోవాలి.


ఈ మిశ్రమాని పిండిలో ఉంచి అంచుల‌ను మూసి వేయాలి.  ప‌రోటాలా వ‌త్తుకోవాలి.  ప‌రోటాల‌ను వ‌త్తుకున్న త‌రువాత వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి.  ఇలా చేయ‌డం వ‌ల్ల మూథీ ఆలూ ప‌రాటా త‌యారవుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: Ragi Recipe: ఆరోగ్యకరమైన రాగి దోశ తయారు చేసుకోండి ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter