ప్రకృతి ( Nature ) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క.  పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant ) రారాజు అంటారు.



రోజా మొక్క నిండా ముళ్లు ఉన్నా.. అది చూడటానికి చాలా అందంగా కినిపిస్తుంది. దాని సువాసన, సౌందర్యం అందరి మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే మనసుకు ఆహ్లాదకరంగా కనిపించడమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు (Medicinal Properties) కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో ( Ayurveda) గులాబీని ఎన్నో విధాలుగా, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి వినియోగిస్తారు. ఆరోగ్యానికి ( Health) చాలా మంచిది.



గులాబీలో ఉన్న ఔషధ గుణాలు 
- నోటి సంబంధిత వ్యాధులను దూరంగా చేయడానికి గులాబీ పువ్వు ఉపయోగపడుతుంది.
- తలపై తగిలిన గాయాలను నయం చేయగలుగుతుంది.
- ఎండా కాలంలో గులాబితో తయారయ్యే గుల్కంద్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంలాయి.- ట్యూబర్ క్లోసిస్ అంటే.. టీవి ట్రీట్మెంట్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది.
- ఉదరసంబంధిత వ్యాధులను కూడా లాభదాయకంగా ఉంటుంది.
- లీవర్ రోగాలకు కూడా ఇది రామబాణం లాంటిది.