Couple Goals: బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి Relationship Tips

బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి, ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్  ( Couple Goals ) పెట్టుకోవడం అవసరం.

Last Updated : Sep 15, 2020, 06:13 PM IST
    • బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రేమానుభూతి కలకాలం నిలిచి ఉండటానికి..
    • ఎప్పటికప్పుడు తాజా అనుభూతి కోసం..
    • మీరు మీ పార్టనర్ కలిసి కొన్ని కపుల్ గోల్స్ ( Couple Goals ) పెట్టుకోవడం అవసరం.
Couple Goals: బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి Relationship Tips

కొత్త తరంలో అన్ని అనుభవాలు వేగంగా మారిపోతుంటాయి. అంటే ప్రేమ, కోపం, తాపం, ఆవేశం ఇలా అన్ని వేగంగా వచ్చి వెళ్లిపోతుంటాయి. ఇలాంటి రాపిడ్ మూమెంట్స్ లో  బంధాల్లో రాపిడి రాకుండా మోపెడు ప్రేమ మీ గుండెల్లో నిలిచి ఉండేలా చూసుకోవాలి. బ్యాంకు బ్యాలెన్స్ కన్నా గుండెల్లో ప్రేమ బ్యాలెన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇందులో కొత్త తరం అంటే ఈ రోజుల్లో ముద్దుగా పిలుచుకునే మిలేనియల్స్ (Millenial). బంధాల ఈ డిక్షనరీలో ( Dictionary ) ఇలాంటి కొత్త పదాలు బోలెడు ఉన్నాయి. 

పాపులర్ అవుతున్న కపుల్ గోల్స్ 
ఇవాళ మాటల నుంచి సోషల్ మీడియా (Social Media) వరకు మాటల్లో కపుల్ గోల్స్ గురించి (Couple Goals) తరచూ వింటూ ఉంటున్నాం. చాలా మంది తమ పరిస్థితిని బట్టి కపుల్ గోల్స్ పెట్టుకుంటున్నారు. వీటి ఆధారంగా తమ జీవితం, తమ బంధాలను సెట్ చేసుకుంటున్నారు. గోల్ అంటే లక్ష్యం. కపుల్ గోల్స్ అంటే బంధం మరింత బలపడటానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకుని వాటికి అనుగుణంగా జీవిస్తూ వాటిని సాధించడం. అనేక సందర్భాల్లో మాటల మధ్య, ర్యాప్ సాంగ్స్ ( Rap Songs), షోస్ (Shows ), ఇంస్టాగ్రామ్ క్యాప్షన్ లో ( Instagram Captions) కపుల్ గోల్స్ అనే పదం వాడుతూ ఉంటారు.

కపుల్ గోల్స్ అంటే ? (  What is Couple Goals Mean ? )
మిలీనియల్ జెనరేషన్ లో కపుల్ గోల్స్ అర్థం ఏంటంటే..ఒక జంట తమ మధ్య అన్ని విషయాలను అర్థం చేసుకుని, తెలుసుకుని అన్ని విషయాలను సరిగ్గా కమ్యూనికేట్ (Communication) చేసుకోవడం. జీవితంలో ఎదరయ్యే అన్ని కష్టాలను, సుఖాలను, బాధలు, సంతోషాలను సమంగా బాధ్యత వహిస్తూ జీవిచడం. కపుల్ గోల్స్ అనే టెర్మ్ ( Term ) ను ఎక్కువగా వాడే వారు చెప్పేది ఏంటంటే.. పరిస్థితి ఎలా ఉన్నా కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం అనేది ఆపకూడదు. ఫ్యామిలీ కౌన్సెలర్ల ప్రకారం కొత్త తరం జంటలు ( Couples ) తమ తల్లిదండ్రుల్లా బతకాలి అని అనుకోవడం లేదు.  వాళ్ల పిల్లల పెంపకం వరకు మాత్రమే తమ జీవితాన్ని పరిమితం చేసుకోవాలి అనుకోవడం లేదని అంటున్నారు.  పిల్లలే కాకుండా తమ వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం అని అనుకుంటున్నారట.

లవ్ లైఫ్ ఆనందమయం అవ్వాలి అంటే కపుల్ గోల్స్ ఇవే...

1.  లవ్ లైఫ్ ను (Love Life) హ్యాపెనింగ్ ఉంచండి (Happening):

బంధాల్లో బోర్ రాకుందా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఎప్పుడూ కొత్తకొత్తగా ఉన్నదీ.. స్వర్గం ఇక్కడే ఉన్నది.. అనే ఫీలింగ్ వచ్చేలా కొత్తగా ట్రై చేయండి. కొత్త కొత్త ప్రదేశాలను చుట్టిరండి.

2.మాటలు ఆపకండి:

ఎంత పెద్ద గొడవ అయినా, అలక అయినా, కమ్యూనికేషన్ మాత్రం అస్సలు తగ్గించకండి.  కమ్యూనికేషన్ గ్యాప్ (Communication Gap) వల్ల జంటల మధ్య దూరం పెరుగుతుంది.  దీనిక ప్రధాన కారణం ఇగో ( EGO) లేదా అహం.  ఇగో ను పక్కనపెట్టి మీ కమ్యూనికేషన్ పై ఫోకస్ పెట్టి సాధారణ పరిస్థితి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి.

3. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి:  

మీరు వేరే వేరు ప్రొఫెషనల్ లో ఉంటే ( Profession ) ఒకరి ఫ్రొఫెషన్ ను ఒకరు గౌరవించుకోండి. పార్ట్ నర్ చేస్తున్న పనిని మెచ్చుకోండి.  తన ఇష్టా అయిష్టాలను గౌరవించండి. వీటి వల్ల కూడా బంధాలు బలంగా మారుతాయి.

4. కలిసి ఎంజాయ్ చేయండి:  

మీ మిత్రులతో  మాత్రమే కాదు.. జీవిత భాగస్వామితో కూడా కలిసి ఎంజాయ్ చేయండి. ఔటింగ్ కి వెళ్లండి. దీని వల్ల అండర్ స్టాండింగ్ (Understanding)పెరుగుతుంది. ఈ రోజుల్లో ఎన్నో జంటల కపుల్ గోల్స్ లో ఎడ్వెంచర్ ట్రిప్ (Adventure Trip)పై వెళ్లడం కూడా ఉంటుంది.

5. కలిసి ఎదగడం ( Grow ):

దీని అర్థం ఏంటంటే ఒకరు కెరియర్ (Career) లేదా ఫిడ్నెస్ (Fitness) లో ముందుంటే ఇంకొరికి తక్కువ చేయకూడదు. కొంచెం వెనక ఉన్న పార్ట్ నర్ ను వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. దీని వల్ల బంధం మరింతా బలపడుతుంది.

మీరు కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటే.. ఆనందకరమైన జీవితం కొనసాగించాలి అనుకుంటే తప్పుకుండా కపుల్ గోల్స్ పెట్టుకోండి. 
ఈ స్టోరీ తప్పుకుండా మీ లైఫ్ పార్ట్ నర్ కు షేర్ చేయండి.

ఇలాంటి లైఫ్ స్టైల్ కంటెంట్ మరిన్ని చదవడానికి క్లిక్ చేయండి

Trending News