Chia Seeds For Weight Loss: అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ప్రస్తుతం చాలా మందిలో ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారాల్లో నియమాలు, వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరు బరువు తగ్గలేకపోతున్నారు. అయితే సులభంగా ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే తీసుకుని ఆహారంలో పలు రకాల మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పొట్ట స్లిమ్‌ అవ్వడమేకాకుండా శరీరం దృఢంగా మారుతుంది. అయితే దీని కోసం చియా విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో ప్రోటిన్లు, విటమిన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బరువును సులభంగా తగ్గించేందుకు సహాయపడతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చియా సీడ్స్ అంటే ఏమిటి?:
చియా విత్తనాలను చాలా మంది తులసి గింజలా భావిస్తారు. కానీ తులసి గింజలు వేరు.. చియా విత్తనాలు వేరు. వాస్తవానికి, చియా అనేది మెక్సికోలో కనిపించే పుదీనా కుటుంబానికి చెందిన మెక్సికన్ మింట్. చియా గింజలలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలి నియంత్రించేందుకు సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయం చియా విత్తనాలను వినియోగించాలి. దీని కోసం చియా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు నిమ్మరసంలో కలిపి తీసుకోవాలి.


గంజిలో కూడా చియా గింజలను కలుపుకుని తీసుకోవచ్చు:
ఊబకాయం తగ్గడానికి.. చియా గింజలను గంజిలో కూడా కలుపుకుని తాగొచ్చు. గంజిలో ఒక చెంచా నానబెట్టిన చియా గింజలు కలిపి తాగండి. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గడమేకాకుండా బాడీ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆహారం తీసుకునే క్రమంలో కూడా పెరుగులో కలుపుకుని తినొచ్చు. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల త్వరలోనే సులభంగా బరువు తగ్గొచ్చు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Shukra Gochar 2022: శుక్రుడి కన్యారాశి ప్రభావం, సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల్నించి ఆ మూడు రాశుల పరిస్థితి ఏంట


Also Read: Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook