Shukra Gochar 2022: శుక్రుడి కన్యారాశి ప్రభావం, సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల్నించి ఆ మూడు రాశుల పరిస్థితి ఏంటి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహాన్ని సుఖ, వైభవాలు, సౌందర్యం, భోగ విలాసాలు, వివాహం, ఐశ్వర్యానికి ప్రతీతి. సెప్టెంబర్ 24 న శుక్రగ్రహం కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. ఆ ప్రభావం పలు రాశులపై పడనుంది. శుక్రగ్రహ గోచారం ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపై పడనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Venus Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహాన్ని సుఖ, వైభవాలు, సౌందర్యం, భోగ విలాసాలు, వివాహం, ఐశ్వర్యానికి ప్రతీతి. సెప్టెంబర్ 24 న శుక్రగ్రహం కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. ఆ ప్రభావం పలు రాశులపై పడనుంది. శుక్రగ్రహ గోచారం ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపై పడనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

1 /4

శుక్రగ్రహం Venus సెప్టెంబర్ 24 ఉదయం 8 గంటల 51 నిమిషాలకు కన్యారాశిలో ప్రవేశించనున్నాడు. కన్యారాశిలో ప్రవేశించిన తరువాత అప్పటికే కన్యారాశిలో ఉన్న సూర్యుడు, బుధ గ్రహాలతో కలిసి శుక్రగ్రహం యుతి ఏర్పడుతుంది. శుక్రగ్రహం కన్యారాశిలో ప్రవేశం సందర్భంగా ఏ మూడు రాశులపై ప్రభావం పడుతుందో చూద్దాం..

2 /4

కన్యారాశి Virgo జాతకులకు శుక్రగ్రహ గోచారం చాలా అద్భుతమైందిగా ఉంటుంది. గోల్డెన్ డేస్‌గా చెప్పవచ్చు. అన్ని విషయాల్లోనూ విజయం మీదే అవుతుంది. ఫలితంగా ఆత్మ విశ్వాసం పెరిగిపోతుంది. కన్యారాశి వారి కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయం.

3 /4

వృషభరాశికి Taurusఅధిపతి శుక్రుడే. శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించిన తరువాత వృషభరాశి జాతకులకు పెండింగ్ కోర్కెలు నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. సుఖ సంతోషాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయ. అధిక లాభాలు ఆర్జిస్తారు. 

4 /4

శుక్రగ్రహం కన్యారాశి ప్రవేశం కారణంగా మిధునరాశి Gemini అదృష్టం తెర్చుకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. దాంతోపాటు దాంపత్య జీవితం బాగుంటుంది. ఉద్యోగస్థులకు అనువైన సమయం. మిధునరాశి వారికి అకస్మాత్తుగా అంతులేని డబ్బులు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం లభిస్తుంది.