Chia Seeds Benefits: మనిషి శరీరాన్ని ఫిట్ అంట్ హెల్తీగా ఉంచాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా ఉండాలి. ఆరోగ్యం కోసం చాలామంది పండ్లు కూరగాయాలు తీసుకోమని సూచిస్తుంటారు. పండ్లు కూరగాయలతో పాటు కొన్ని సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా లాభం చేకూరుస్తుంటాయి. అందులో ముఖ్యమైంది చియా సీడ్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో విరివిగా లభించే చియా సీడ్స్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్, ఫైబర్, ఎనర్జీ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీస్, సెలేనియం, విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ9, ఇ వంటి పోషకాలు కావల్సినన్ని లభిస్తాయి. అందుకే క్రమం తప్పకుండా చియా సీడ్స్ తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చియా సీడ్స్‌ను పరగడుపున తీసుకుంటే మరింత ప్రయోజనకరం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వివిధ రకాల వ్యాధుల్నించి పోరాడే శక్తి లభిస్తుంది. చియా సీడ్స్‌తో పాటు చియా సీడ్స్ వాటర్ వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. 


చియా సీడ్స్‌లో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ ఉదయం వేళ చియా సీడ్స్ తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అజీర్తి సమస్య ఉండదు. చియా సీడ్స్‌లో ఉండే కొన్ని రకాల పోషకాల కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మీరు ఒకవేళ మధుమేహం వ్యాదిగ్రస్థులైతే చియా సీడ్స్ నీళ్లు తప్పకుండా మీ డైట్‌లో భాగం చేసుకోవాలి. 


చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవాళ్లకు చియా సీడ్స్ నీళ్లు అద్భుతంగా దోహదపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. రోజూ పరగడుపున చియా సీడ్స్ నీళ్లు తాగితే శరీరం ఫిడ్ అంట్ హెల్తీగా ఉంటుంది. 


Also read: Fit and Slim Tips: రోజూ రాత్రి వేళ ఈ టిప్స్ పాటిస్తే ఫిడ్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook