Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన సీడ్స్ ఇవే, పోషక పదార్ధాలు ఫుల్
Cholesterol: అన్ని రోగాలకు కారణం చెడు కొలెస్ట్రాల్. ప్రకృతిలో లభించే పదార్ధాలతో కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా హెల్తీ సీడ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ సీడ్స్ ఏంటో తెలుసుకుందాం..
Cholesterol: అన్ని రోగాలకు కారణం చెడు కొలెస్ట్రాల్. ప్రకృతిలో లభించే పదార్ధాలతో కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా హెల్తీ సీడ్స్ సహాయంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆ సీడ్స్ ఏంటో తెలుసుకుందాం..
రక్తంలో పేరుకున్న కొలెస్ట్రాల్ పలు వ్యాధులకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్‌ను నిర్మూలిస్తే మెరుగైన ఆరోగ్యం మీ సొంతమౌతుంది. కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. మొక్కల్ని మొలికించే ఎన్నో రకాల పోషక పదార్ధాలు విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే సీడ్స్‌ను హెల్తీ ఫుడ్ రూపంలో తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో పాటు రక్తపోటు, మధుమేహం సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు.
Flaxseeds
ఫ్లక్స్ సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ పెద్ద మొత్తంలో ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఈ విత్తనాల్ని పౌడర్‌గా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి.
Chia Seeds
చియా సీడ్స్ కూడా కొద్దిగా ఫ్లక్స్ సీడ్స్‌లా కన్పిస్తాయి. ఇందులో కూడా ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఇతర పోషకాలుంటాయి. సబ్జా గింజల్లా కన్పిస్తాయి. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, థయామిన్, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి.
Sesame Seeds
నువ్వుల ఉపయోగం చాలా దేశాల్లోనే ఉంది. ఇతర విత్తనాల్లానే ఇందులో కూడా పోషక పదార్ధాలు ఎక్కువ. ఫైబర్, 5 రకాల ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణకు దోహదపడతాయి.
Pumpkin seeds
ఆనపకాయ విత్తనాల్ని సాధారణంగా మనం పడేస్తుంటాం. కానీ ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇందులో ఫైటోస్టెరాల్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించవచ్చు.
Also read: Benefits Of Walnuts: వాల్‌నట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook