Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ ఉన్న వారు తప్పకుండా ఈ పని చేయండి..గుండెపోటు నుంచి రక్షణ పొందండి..!
Cholesterol Reduce Tips: మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం సర్వసాధారణమైది. అయితే శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరగడంతో గుండె సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ గుండె పోటు నుంచి రక్షణ పొందేందుకు ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Reduce Tips: మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం సర్వసాధారణమైంది. అయితే శరీరంలో కొలస్ట్రాల్ స్థాయి పెరగడంతో గుండె సమస్యలకు దారితీస్తున్నాయి. గుండె పోటు నుంచి రక్షణ పొందేందుకు ఆహారంపై శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఈ చిన్న సమస్య భవిష్యత్తులో ఇబ్బందిని సృష్టించవచ్చని అంటున్నారు. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే సమస్యలు పెరుగుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం కోసం ఇప్పుడు చిట్కాలను తెలుసుకుందాం.
1. వెల్లుల్లి శరీరానికి ఎంత మేలుస్తుంది:
కూరలను రుచి కరంగా చేయడానికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. ఈ వెల్లుల్లి నిత్యం ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉంచుతుంది. ప్రధానంగా వెల్లుల్లి శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
2. గ్రీన్-టీ:
గ్రీన్-టీ బరువును తగ్గించడమే కాకుండా.. మీ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కావున ప్రతి రోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం శరీరానికి చాలా మంచిది.
3. పసుపు పాలు:
పాలలో పసుపు వేసుకుని తాగితే అది మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందిని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా పసువులో ఉండే గుణాల వల్ల కొలెస్ట్రాల్ సులభంగా నియంత్రిణలోకి వస్తుందని నిపుణులు తెలిపారు.
4. అవిసె గింజలు:
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అవిసె గింజలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలుసు. వాస్తవానికి వీటిలో ఒమేగా- 3 కొవ్వు ఆమ్లాలు, లినోలెనిక్ ఆమ్లం ఉంటాయి, ఇవి నేరుగా చెడు కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Sachin - Gill: సేమ్ టూ సేమ్.. 2009లో సచిన్, 2022లో గిల్! ఐపీఎల్‌లో ఈ ఇద్దరు మాత్రమే..
Also Read: Raisin Water Benefits: ఎండుద్రాక్ష నీరు శరీరానికి ఎంత మేలో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.