Raisin Water Benefits: ఎండుద్రాక్ష నీరు శరీరానికి ఎంత మేలో తెలుసా..!

Raisin Water Benefits:  ద్రాక్షను ఎండబెట్టడం వల్ల ఎండుద్రాక్ష తయారవుతుంది. ఇది నోటికి తియ్యగాను ఎంతో రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా స్వీట్ల తయారీలో వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచేందుకు సహాయపడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 01:47 PM IST
  • ఎండుద్రాక్ష నీరు శరీరానికి ఎంత మేలు చేస్తాయి
  • ఎండుద్రాక్ష నీరు కాలేయాన్ని శుద్ధపరుచుతుంది
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Raisin Water Benefits: ఎండుద్రాక్ష నీరు శరీరానికి ఎంత మేలో తెలుసా..!

Raisin Water Benefits: ద్రాక్షను ఎండబెట్టడం వల్ల ఎండుద్రాక్ష తయారవుతుంది. ఇది నోటికి తియ్యగాను ఎంతో రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా స్వీట్ల తయారీలో వినియోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కానుక శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షను తీనడమే కాకుండా నీటిలో నానబెట్టుకుని కూడా నీటిని తాగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది డిటాక్స్ డ్రింక్‌గా పనిచేయడమే కాకుండా శరీరాని మంచి లాభాన్ని చేకూర్చుతుంది. శరీరంలో ఉండే మలినాలను తొలగించడానికి పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. ఈ నీరు రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. అయితే ఎండుద్రాక్ష నీరు ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కాలేయాన్ని శుద్ధపరుచుతుంది:

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల మీ శరీరంలోని అన్ని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది మీ కాలేయాన్నిలోని మలినాలను తొలగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

ఎండుద్రాక్ష నీరు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిణ:

ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్, అనేక విటమిన్లు విచ్చల విడిగా ఉన్నాయి. అవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

రక్తపోటును నియంత్రణ:

ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తపోటును నియంత్రించడానికి కృషి చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్త సరఫరాను పెంచడానికి దోహదపడుతుంది. ఎముకలను దృఢ పర్చుతుంది.

ఎండుద్రాక్ష నీటిని ఎలా తయారు చేసుకోవాలి:

ముందుగగా 2 గ్లాసుల నీరు తీసుకిని అందులో 150 గ్రాముల ఎండుద్రాక్ష వేసి మరిగించాలి. ఇలా చేసిన నీరును రాత్రంతా పక్కన ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. రుచిని పెంచుకోవడానికి ఈ నీటిలో నిమ్మరసాన్ని వేసుకోవాలి.

Also Read: Pomegranate Side Effects: దానిమ్మ పండు తినడం వల్ల కలిగే అనర్థాలు!

Also Read: Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x