Chronic Cough Reasons: శీతాకాలంలో పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఇమ్యూనిటీ లోపించడం వల్ల సీజనల్ వ్యాధుల సమస్య పెరిగిపోతుంటుంది. ఇందులో ముఖ్యమైంది దగ్గు. సాధారణంగా దగ్గు అనేది 4-5 రోజులు లేదా వారం రోజుల వ్యవధిలో తగ్గిపోతుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారాలు, నెలల తరబడి పీడిస్తుంది. దీనికే క్రానిక్ కాఫ్ అంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమకాటు వల్ల కావచ్చు లేదా సీజన్ మార్పు వల్ల కావచ్చు లేదా చలిగాలుల వల్ల కావచ్చు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా దగ్గు తీవ్రంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గు నుంచి ఒక్కోసారి ఉపశమనం లభించదు. ఇన్‌ఫెక్షన్ అనుకుని సరిపెట్టుకుంటాం. కానీ విటమనిన్ బి12 లోపం వల్ల కూడా ఇలా నిరంతరం అదే పనిగా దగ్గు రావచ్చని చాలామందికి తెలియదు. ఆశ్యర్యంగా ఉన్నా నిజమే ఇది. విటమిన్ బి 12కు క్రానిక్ కాఫ్‌కు సంబంధమేంటో పరిశీలిద్దాం..


దీర్ఘకాలంగా దగ్గు వెంటాడుతుంటే కచ్చితంగా విటమిన్ బి12 లోపం వల్ల కావచ్చని చాలా అధ్యయనాల్లో వెల్లడైందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోజూ డైట్‌లో విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవల్సి ఉంటుంది. అప్పటికీ ఈ సమస్య దూరం కాకపోతే మంచి వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. అవసరమైన పరీక్షలు కూడా చేయించుకోవాలి. విటమిన్ బి12 లోపం వల్ల కన్పించే ఇతర లక్షణాల్లో చర్మం పసుపుగా మారడం, డిప్రెషన్, తరచూ తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు, కండరాల నొప్పి ఉంటాయి.


విటమిన్ బి12 లోపం తలెత్తకుండా ప్రకృతిలో చాలా పదార్ధాలున్నాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్‌లో ఉండేట్టు చూసుకుంటే చాలు. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్‌లో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. మాంసాహారులకు ఇదే మంచి ప్రత్యామ్నాయం. రెడ్ మీట్‌లో కూడా విటమన్ బి12 కావల్సినంత పరిమాణంలో ఉంటుంది. అందుకే మాంసాహారులకు సాధారణంగా విటమిన్ బి12 లోపం తలెత్తదు. 


ఇక కొబ్బరి నీళ్లు మరో మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఇందులో విటమిన్ బి12 చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. రోజూ ఒక కొబ్బరి బొండాం తాగితే సరిపోతుంది. ఇక  ఫ్రూట్స్‌లో బ్లూబెర్రీ అద్భుతమైంది. రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. బ్లూ బెర్రీస్ తినడం వల్ల విటమిన్ బి12 లోపం తొలగిపోతుంది. 


బీట్‌రూట్‌లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. బీట్‌రూట్ సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇక చివరిది యాపిల్స్. యాపిల్‌లో విటమిన్ బి12తో పాటు శరీరానికి కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటుంటారు.


Also read: IND Vs NZ ICC World Cup 2023: భారత్‌ను వెంటాడుతున్న ఆ గండం.. సెమీ ఫైనల్స్ రికార్డులు ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook