Heart attack signs: హార్ట్​ ఎటాక్​.. ఇటీవలి కాలంలో వయసుతో సంబంధంలో లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్య. హైపర్​ టెన్షన్​, గ్యాస్ట్రిక్ ఎసిడిటీతో బాధ పడుతున్న వారికి కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని ఓ నివేదికలో తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎసిడిటీ, హైపర్​ టెన్షన్​ వల్ల వచ్చేది కేవలం పానిక్ ఎటాక్ మాత్రమే కావచ్చు (Symptoms of Panic Attack) అనేది ఆ నివేదిక సారాంశం. అయితే ఇది హార్ట్ ఎటాక్​కు దారి తీసే సంకేతంగా భావించాలని (Symptoms of Heart attack) పేర్కొంది బ్రిటిష్​ హార్ట్​ ఫౌండేషన్​ (బీహెచ్​ఎఫ్​).
బీహెచ్​ఎఫ్​ ప్రకారం.. ఈ పానిక్ ఎటాక్ కూడా గుండె పోటు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె పోటు ఆందోళనలు మరింత తీవ్రం చేస్తుందని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే గుండె జబ్బులతో (Heart disease) బాధపడుతున్న వ్యక్తి.. పానిక్ ఎటాక్​కు గురైనా అందులో హార్ట్ ఎటాక్​ను పోలిన లక్షణాలు ఉంటాయని బీహెచ్​ఎఫ్​ నిపుణులు చెబుతున్నారు.


పానిక్ ఎటాక్​ లక్షణాలు ఇలా..


ఊపిరాడకపోవడం
నలతగా అనిపించడం
అలసటగా ఉండటం లేదా శరీరం వేడెక్కడం
గుండె నొప్పిగా అనిపించడం
గుండెలో ఆందోళనగా అనిపించడం
ఎక్కువ చలి లేదా వేడిగా అనిపించడం
కళ్లు మసకబారడం
వేళ్లు జలదరించడం
చేవిలో శబ్ధాలు వినిపించడం


లక్షణాలు ప్రభావం ఇలా..


హార్ట్​ ఎటాక్​కు సంబంధించిన లక్షణాలు ఒక్క సారిగా కనిపించడం లేదా కొన్ని రోజుల నుంచి కొనసాగుతూ రావచ్చు. వీటన్నింటికి తోడు గురక లేదా విపరీతమైన దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చని బీహెచ్​ఎఫ్​ హెచ్చరిస్తోంది. (ఊపిరి తిత్తుల్లో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించొచ్చు.)


ఈ లక్షణాలన్నీ.. గుండెపోటుకు సంబంధించి సాధారణమైన లక్షణాలు. అలా కాకుండా.. మయో క్లీనిక్ ప్రకారం హార్ట్ ఎటాక్​ వచ్చిన వారిలో కనిపించే సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి.


ఒత్తిడి, నొప్పి ఛాతీ, చేతుల్లో జలదరింపు.. అది నెమ్మదిగా మెడ, శరీరం వెనకవైపు సోకుతుంది.
వికారంగా అనిపించడం, అజీర్తి, గుండెల్లో నొప్పిగా అనిపించపడం, కడుపు నొప్పు, ఊపిరి ఆడకపోవడం, చల్లని చెమటలు, అసలట, మైకం వంటివి కనిపిస్తాయి.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


  • వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. అంబులెన్స్​కు కాల్ చేసి పరిస్థితి (Precautions to take to prevent heart attack) వివరించాలి

  • వైద్య సిబ్బంది వచ్చిన వెంటనే మీకు ఉన్న లక్షణాలను పూర్తిగా వివరించండి.

  • హార్ట్ ఎటాక్​గా అనుమానిస్తే.. ఆ వ్యక్తి కూర్చిని ఆందోళనను అదుపు చేసుకుని కూర్చోవడం ఉత్తమం

  • అత్యవసర సహాయం కావాల్సి వస్తే..  ఆస్పిరిన్ నమలడం మంచిదని మయో క్లినిక్ సలహా. ఇది మీ శరీరంలో రక్తం గట్టకట్టకుండా సహాయపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరగవుతుంది. అయితే ఇందుకు డాక్టర్ సలహా తప్పనిసరి అని మయో క్లీనిక్ చెబుతోంది.


ముందస్తు జాగ్రత్తలు..


  • హార్ట్​ ఎటాక్ రాకుండా ముందస్తుగా కొన్న జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేమిటంటే.. ఆకు కూరలు అదికంగా తినడం మంచిది. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కవగా లభించే ఆహారం (Food to take to prevent heart attack) తీసుకోవాలి.

  • చేపలు తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. చెపల్లో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండే ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడతాయి.

  • ఇక అన్నింటికంటే ముఖ్యంగా అధికంగా ఒత్తిడికి లోను కాకూడదు. ఒత్తిడి అనిపిస్తే.. కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ఉత్సాహంగా పని ప్రారంభించడం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.


Also read: Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!


Also read: Lemon Benefits: రోజుకో నిమ్మకాయ రసం... కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook