Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!

Peanuts Side Effects: వేరుశనగ తినడానికి కొంత తీపిదనంతో నిండి ఉంటాయి. కానీ, అలాంటి తీపి పదార్థాలు తినడం వల్ల డయాబెటిస్ ఉన్న వారికి హాని కలగొచ్చు. అయితే వేరుశనగ, దాని ఉత్పత్తులను షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా? లేదా? తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 05:15 PM IST
Peanuts Side Effects: డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్తులు వేరుశనగ తినడం ఆరోగ్యానికి హానికరం!

Peanuts Side Effects: వేరుశనగ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని చాలా మంది భావిస్తారు. డయాబెటిస్ మెల్లిటస్ (షుగర్)తో బాధపడుతున్న రోగులు వారి ఆహారంలో వేరుశనగ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణలు అంటున్నారు. కానీ, వేరుశనగలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

వేరుశనగలో ఉండే పోషకాలు..

వైద్యనిపుణుల సూచన ప్రకారం.. వేరుశనగను మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరమని తెలుస్తోంది. ఎందుకంటే వేరుశనగలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ తో పాటు ప్రయోజనకరమైన పోషకాలను కలిగి ఉంటుంది. కానీ, వేరుశనగ లేదా దాని ఉత్పత్తులను తినడం వల్ల మధుమేహం (షుగర్) వచ్చే ప్రమాదం లేదని దీని అర్థం కాదు. 

వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ బి, నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఇ ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మధుమేహం సమస్యలో వేరుశనగ వినియోగం ప్రయోజనకరంగా మారచ్చొని వైద్యులు చెబుతున్నారు. 

వేరుశనగ మంచిదేనా?

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. కాబట్టి, మధుమేహం సమస్యలో వేరుశెనగ వినియోగం ప్రయోజనకరంగా పరిగణిస్తున్నారు. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. 

ఇంకా వేరుశెనగలోని మాంగనీస్ వంటి పోషకాలు మధుమేహంలో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఈ క్రమంలో వేరుశనగను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, వేరుశనగను ఎక్కువగా తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  

వేరుశనగ ఉత్పత్తులను తినొచ్చు కానీ..

వేరుశనగలు కాకుండా వాటితో తయారు చేసిన పదార్థాలు పీనట్ బటర్ ను తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుంది. డయాబెటిస్ తో బాధపడేవారు పీనట్ బటర్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమని వైద్యులు స్పష్టం చేశారు. పీనట్ బటర్ లో షుగర్ కంటెంట్ డయాబెటిస్ కు కారణం కావొచ్చని తెలుస్తోంది. 

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం.. ఉదయాన్నే వేరుశెనగ లేదా పీనట్ బటర్ తీసుకోవడం వల్ల రోజంతా మీ శరీరంలోని బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ స్పైక్ కూడా తగ్గుతుంది. వేరుశెనగలో తగినంత మెగ్నీషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ రోజూ 100 గ్రాముల కంటే ఎక్కువ వేరుశెనగ తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో సమస్యలు వస్తాయి.   

Also Read: Lemon Benefits: రోజుకో నిమ్మకాయ రసం... కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలు ఇవే

Also Read: Omicron Variant Study: ఒమిక్రాన్ సోకినవారిలో ఏ లక్షణాలు లేకపోవడానికి కారణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News